Chicken Shops Closed : నాన్ వెజ్ లవర్స్ కి బ్యాడ్ న్యూస్.. నగరంలో చికెన్ షాపులు బంద్.. ఎప్పటి నుంచంటే..!
Chicken Shops Closed : నగరంలో నాన్ వెజ్ లవర్స్ కి భారీ షాకింగ్ వార్త. చికెన్ దుకాణాల బందుకు పిలుపునిచ్చారు
- Dharani Pilli
- Published On : March 25, 2026 / 05:49 PM IST
Chicken shops in Hyderabad to remain closed from April 1 due shop owners association called for protest
Chicken Shops Closed : నగరంలో చాలా మందికి ప్రతిరోజూ నాన్-వెజ్ ఉండాల్సిందే. ముక్క లేకపోతే ముద్ద దిగదు. అయితే గత కొన్ని రోజులుగా తెలంగాణలో చికెన్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం కేజీ స్కిన్‌లెస్ చికెన్ ధర రూ.370 వరకు ఉంది. పెరిగిన ధర చూసి చికెన్ తినాలంటేనే భయపడుతున్నారు. మరికొందరు మాత్రం ధరతో సంబంధం లేకుండా లాగించేస్తున్నారు. ఇదిలా ఉంటే నగరంలోని నాన్-వెజ్ లవర్స్‌కి భారీ షాకిచ్చారు చికెన్ షాపుల యజమానులు. ఏప్రిల్ 1 నుంచి నగరంలో చికెన్ దుకాణాలు బంద్ చేస్తున్నట్లు ప్రకటించారు.
నగరంలోని చికెన్ షాపు యజమానులు కీలక ప్రకటన చేశారు. పౌల్ట్రీ కంపెనీలు సరిపడా లాభాల మార్జిన్లు ఇవ్వడం లేదని తెలిపారు. ఫలితంగా వ్యాపారం చేయడం కష్టంగా ఉందన్నారు. ఖర్చులు పెరుగుతున్నాయి.. ఆదాయం తగ్గుతోంది.. దీంతో చికెన్ షాపులు నడపడం కష్టంగా ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యలపై నిరసన తెలియజేయడం కోసం ఏప్రిల్ 1 నుంచి నగరంలో చికెన్ షాపులు బంద్ చేయాలని నిర్ణయించామని.. చికెన్ షాపుల యజమానుల సంఘం పిలుపునిచ్చింది. పౌల్ట్రీలు లాభాల మార్జిన్లు పెంచేవరకు ఈ బంద్ కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే గత కొన్ని రోజులుగా నగరంలో కోడిగుడ్ల ధరలు భారీగా తగ్గుతున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు ఇందుకు కారణమని తెలుస్తోంది. యుద్ధం వల్ల పశ్చిమాసియా దేశాలకు మన దగ్గర నుంచి గుడ్ల ఎగుమతులు తగ్గిపోయాయి. అంతర్జాతీయ ఆందోళనలు, రవాణా మార్గాల్లో అంతరాయం వల్ల పోర్టులు, విమానాశ్రయాలు పూర్తి స్థాయిలో పనిచేయలేకపోతున్నాయి. దీంతో ఇండియా నుంచి గుడ్ల ఎగుమతులు పూర్తిగా నిలిచిపోయాయి. దీనివల్ల మన దగ్గర గుడ్ల సరఫరా పెరిగి.. ధరలు దిగివచ్చాయి.
