దిశ నిందితుల శవాల్ని చూడాలని ఉంది : దిశ తల్లి 

  • Publish Date - December 6, 2019 / 05:12 AM IST

దిశ నిందితులు మృతదేహాలు చూడాలని ఉంది ఆమె తల్లి అన్నారు. తమ బిడ్డను అత్యంత పాశవికంగా చిదివేసి..తమ కలలను కల్లలు చేసిన దుర్మార్గుల శవాల్ని చూడాలని ఉందని దిశ తల్లి తెలిపారు. 

ప్రజల పోరాటాల వల్లనే ఇంత త్వరగా న్యాయం జరిగిందనీ..దుర్మార్గుల అరాచాకానికి అకృత్యానికి బలైపోయిన తమ బిడ్డ అనుక్షణం కళ్లల్లోనే మెదులుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.  తల్లి కడుపుకి ఇంతటి శోకాన్ని కలిగించిన దుర్గార్గులను పోలీసులు ఎన్ కౌంటర్ చేసి తమకు కొంతలో కొంత మనశ్శాంతిని కలుగ చేశారని అన్నారు.  తమ బిడ్డ దూరమైన ఆ బాధ తమకు జీవితాంతం ఉంటుందని..ఇది ఎవ్వరూ తీసివేయలేదనిదని..తమ బిడ్డను అందరి బిడ్డగా భావించి తమకు మద్దతుగా నిలిచి ప్రజలందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు. 
తమ బిడ్డ కోసం ప్రజలంతా పోరాటం చేశారనీ..వారి పోరాటాల వల్లనే ఇంత త్వరగా న్యాయం జరిగిందనీ..ఇంత త్వరగా చర్యలు తీసుకున్న ప్రభుత్వానికి తమకు అండగా నిలిచిన ప్రజలకు ఈ సందర్భంగా దిశ తల్లి ధన్యవాదాలు తెలిపారు.  దుర్మార్గులకు ఇటువంటి శిక్షలు పడితేనే..మరోసారి ఇటువంటి ఘటనలు జరగకుండా ఉంటాయని ఆమె ఆశాభావం వ్యక్తంచేశారు.