KCR Jeevan Reddy : కేసీఆర్ తో జీవన్ రెడ్డి భేటీ.. ‘అన్నా.. దేవుడే పంపాడంటూ’ భావోద్వేగం
KCR Jeevan Reddy : మాజీ కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి నేడు కేసీఆర్ తో భేటీ అయ్యారు.
- Dharani Pilli
- Published On : April 10, 2026 / 05:50 PM IST
former congress leader jeevan reddy meets ex cm kcr at erravalli farmhouse
KCR Jeevan Reddy : సీనియర్ రాజకీయ నేత, మాజీమంత్రి కొన్ని రోజుల క్రితమే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు రెడీ అయ్యారు. ఈక్రమంలో శుక్రవారం మాజీ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌తో జీవన్ రెడ్డి భేటీ అయ్యారు. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో వీరిద్దరూ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. ‘అన్నా.. మీతో కలిసి పని చేయమని దేవుడే పంపించాడన్నా’ అంటూ కేసీఆర్ ని ఆలింగనం చేసుకున్నారు ‘‘ ప్రస్తుతం రాష్ట్రానికి నష్టం జరుగుతోంది. కేసీఆర్‌తో కలిసి పని చేయాల్సిన అవసరం ఉంది. ఇన్నాళ్లకైనా కేసీఆర్‌తో కలిసి పని చేసే అవకాశం రావడంతో నాకు సంతోషంగా ఉంది’’ అని జీవన్‌రెడ్డి అన్నారు.
గత కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మీద తీవ్ర అసంతృప్తితో ఉన్న జీవన్ రెడ్డి కొన్ని రోజుల క్రితమే ఆ పార్టీకి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆయన కారు ఎక్కేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో గురువారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర సీనియర్ నాయకులు..జగిత్యాలలోని జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అలానే ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాలతో పాటు అనేక అంశాలపై మాట్లాడారు. ఈ క్రమంలో శుక్రవారం జీవన్ రెడ్డి ఎర్రవెల్లిలోని ఫామ్‌హౌస్‌లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో భేటీ అయ్యారు. దశాబ్దాలుగా రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న ఈ ఇద్దరు నేతలు.. ప్రస్తుతం ఒక్కటవుతున్నారు.
