Kavitha Arrest: సుప్రీంకోర్టుకు వెళ్తామన్న హరీశ్ రావు.. రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి బీఆర్ఎస్ పిలుపు

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఢిల్లీకి కవితను తరలించారు ఈడీ అధికారులు. రేపు ఢిల్లీలో కవితకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం..

Kavitha Arrest: సుప్రీంకోర్టుకు వెళ్తామన్న హరీశ్ రావు.. రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి బీఆర్ఎస్ పిలుపు

Harish Rao

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో దీనిపై మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. ఇవాళ ఆయన హైదరాబాద్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాజకీయ కుట్రలో భాగంగానే కవితను అరెస్టు చేశారని చెప్పారు. కవిత అరెస్టును సుప్రీంకోర్టులో ఎదుర్కొంటామని తెలిపారు.

మహిళలను ఈడీ అరెస్టు చేసే విషయంలో సుప్రీంకోర్టు విచారణ జరుగుతోందని అన్నారు. కవితను ఉన్నట్టుండి అత్యవసరంగా ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందని నిలదీశారు. కవిత అరెస్టు అప్రజాస్వామికమని హరీశ్ రావు చెప్పారు. రాజకీయ దురుద్దేశంతో అరెస్టు చేశారని తెలిపారు. గత 18 నెలలుగా బీజేపీ నేతలు అరెస్టు చేస్తామని ప్రకటనలు చేస్తున్నారని అన్నారు.

రేపు పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వస్తుందని, అందుకే రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్, బీజేపీ కుట్రలు పన్నాయని చెప్పారు. తమకు అరెస్టులు, వేధింపులు కొత్త కాదని తెలిపారు. మమతా బెనర్జీ, నళిని బెనర్జీ, కవిత కేసులపై సుప్రీంకోర్టు విచారిస్తోందని అన్నారు.

పార్లమెంట్ ఎన్నికల్లో దెబ్బ తీసేందుకు బీజేపీ కుట్రలు పన్నుతోందని చెప్పారు. కవిత అరెస్టు కు నిరసనగా అన్ని నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాల నిర్వహిస్తామని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కును ప్రజా క్షేత్రంలో ఎదుర్కొంటామని తెలిపారు. ఆ రెండు పార్టీలకు శిక్ష తప్పదని అన్నారు. కవిత అరెస్టుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామని బీఆర్ఎస్ ప్రకటించింది.

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఢిల్లీకి కవితను తరలించారు ఈడీ అధికారులు. రేపు ఢిల్లీలో కవితకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం కవితను రౌస్ ఎవెన్యూ కోర్టులో ప్రవేశ పెడతారు.

Lakshmi Narayana : కవిత అరెస్ట్.. తర్వాత ఏం జరగనుంది? సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ రియాక్షన్