Harish Rao: దానం తీర్పు కాంగ్రెస్‌కు తీరని మచ్చ.. అందరూ రాజీనామా చేయాలి.. కాంగ్రెస్‌కు హరీష్ రావు స్ట్రాంగ్ కౌంటర్
దానం నాగేందర్ వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు తీర్పుపై హరీష్ రావు(Harish Rao) తీవ్రస్థాయిలో స్పందించారు.
Harish rao slams congress over danam nagender court verdict
Harish Rao: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు వెలువరించిన చారిత్రాత్మక తీర్పుపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు తీవ్రస్థాయిలో స్పందించారు. ఈ తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వపు ద్వంద్వ వైఖరిని, రాజకీయ అవకాశవాదాన్ని నడిరోడ్డుపై ఎండగట్టిందని ఆయన ఎక్స్ (X) వేదికగా ఘాటు విమర్శలు చేశారు. బీఆర్ఎస్ బీ-ఫామ్‌పై గెలిచిన దానంను కాంగ్రెస్‌లో చేర్చుకుని, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయిస్తూ స్పీకర్ వ్యవస్థ ద్వారా రక్షణ కల్పించాలని చూసిన కాంగ్రెస్ కుట్రలను హైకోర్టు తిప్పికొట్టిందని హరీష్ రావు పేర్కొన్నారు.
Danam Nagender: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు.. హైకోర్టు సంచలన తీర్పు
రాహుల్ గాంధీ రాజ్యాంగ నిబద్ధతపై నిలదీత.. మేనిఫెస్టో హామీలు ఏమయ్యాయి:
దేశమంతటా తిరుగుతూ రాజ్యాంగ పరిరక్షణ గురించి మాట్లాడే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీరును హరీష్ రావు(Harish Rao) తీవ్రంగా తప్పుపట్టారు. 2024 లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోలో పార్టీ ఫిరాయింపులకు పాల్పడితే స్వయంచాలకంగా అనర్హత వేటు వేస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. సొంత ప్రయోజనాల కోసం వచ్చేసరికి ఆ రాజ్యాంగ నిబద్ధత ఎటు పోయిందని, రాహుల్ గాంధీ ప్రతిపాదనలు కేవలం ఓట్ల కోసమేనా అని ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో స్పీకర్ వైఖరిని కోర్టు తప్పుబట్టడం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తీరని మచ్చగా మిగిలిపోతుందని అభిప్రాయపడ్డారు.
ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలి.. బీఆర్ఎస్ సంచలన డిమాండ్:
హైకోర్టు తీర్పును గౌరవిస్తూ స్పీకర్ వెంటనే స్పందించి, కాంగ్రెస్‌లో చేరిన మిగతా ఎమ్మెల్యేలపై ఉన్న పిటిషన్లను కూడా పరిష్కరించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీకి నిజంగా రాజ్యాంగంపై గౌరవం ఉంటే, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలందరితో తక్షణమే రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి, వారిని ఉపఎన్నికల బరిలోకి దింపి కొత్తగా ప్రజా తీర్పు కోరే ధైర్యం ఉందా అని సవాల్ విసిరారు.
