Dasara Traffic Rush: దసరా ముగిసింది.. హైదరాబాద్ బాట పట్టిన జనం.. హైవేలపై భారీగా ట్రాఫిక్ జామ్
దసరా సెలవులు (Dasara Traffic Rush)ముగియడంతో పంతంగి టోల్‌ప్లాజా వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
Heavy traffic jam on vijayawada hyderabad highway at panthangi toll plaza after dasara
Dasara Traffic Rush: దసరా పండుగ సంబరాలు ముగియడంతో సొంతూళ్లకు వెళ్లిన ప్రయాణికులు తిరిగి హైదరాబాద్ నగరానికి తిరుగుపయనమయ్యారు. అక్టోబర్ 21 సాయంత్రం నుంచి నగరానికి వచ్చే ప్రధాన రహదారులన్నీ వాహనాల రద్దీతో చీమల బారులను తలపించాయి. గురువారం (అక్టోబర్ 22) నుంచి పాఠశాలలు, కళాశాలలు తిరిగి ప్రారంభం కానుండటం, అలాగే కార్యాలయాలు యథావిధిగా పనిచేస్తుండటంతో ఉద్యోగులు, విద్యార్థులు తమ కుటుంబాలతో కలిసి భారీగా సిటీ బాట పట్టారు. దీంతో హైదరాబాద్‌కు అనుసంధానంగా ఉన్న జాతీయ రహదారులపై ఊహించని స్థాయిలో వాహన రద్దీ ఏర్పడింది.
విజయవాడ-హైదరాబాద్ హైవేపై భారీ ట్రాఫిక్ జామ్.. పంతంగి వద్ద 9 టోల్ బూత్‌లు ఓపెన్:
ముఖ్యంగా విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై రాకపోకలు తీవ్రంగా స్తంభించిపోయాయి(Dasara Traffic Rush). నార్కట్‌పల్లి, చిట్యాల, పెద్దకాపర్తి నుంచి చౌటుప్పల్ పరిధిలోని పంతంగి టోల్‌ప్లాజా వరకు వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. రద్దీని నియంత్రించేందుకు అధికారులు పంతంగి టోల్‌ప్లాజా వద్ద హైదరాబాద్ వైపునకు ప్రత్యేకంగా 9 టోల్ బూత్‌లను కేటాయించి వాహనాలను వేగంగా పంపిస్తున్నారు. అయినప్పటికీ వాహనాల సంఖ్య విపరీతంగా ఉండటంతో కనుచూపు మేర ట్రాఫిక్ జాం ఏర్పడి వాహనాలు అత్యంత నెమ్మదిగా కదులుతున్నాయి.
ఇబ్బందుల్లో ప్రయాణికులు.. రంగంలోకి దిగి ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న పోలీసులు:
గంటల తరబడి రహదారులపైనే వాహనాలు చిక్కుకుపోవడంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పరిస్థితిని సమీక్షిస్తున్న ట్రాఫిక్ పోలీసులు కీలక జంక్షన్ల దగ్గర ప్రత్యక్షంగా రంగంలోకి దిగి వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరిస్తున్నారు. రద్దీ ఎక్కువగా ఉన్న పాయింట్ల వద్ద ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతూ ట్రాఫిక్ వేగంగా క్లియర్ అయ్యేలా పోలీసులు కృషి చేస్తున్నారు.
