Holidays : విద్యార్థులకే కాదు ఉద్యోగులకు కూడా పండగలాంటి వార్తే.. ఈ వారంలో 3 రోజులు సెలవులు
Holidays : ఈ వారంలో విద్యార్థులు, ఉద్యోగులకు 3, 4 రోజులు సెలవులు రాబోతున్నాయి. ఆ వివరాలు..
- Dharani Pilli
- Updated on- March 16, 2026 / 03:05 PM IST
holidays for students and employees in march 2026 3rd week ramzan ugadi
సెలవులంటే ఇష్టపడని వారు ఎవరుంటారు? విద్యార్థులకే కాదు, ఉద్యోగులు కూడా సెలవుల కోసం ఎదురుచూస్తుంటారు. అయితే గవర్నమెంట్ ఉద్యోగులకు దొరికినన్ని సెలవులు ప్రైవేటు ఉద్యోగులకు లభించవు. అది అలా ఉంచితే, ఈ వారంలో మూడు రోజులు సెలవులు రాబోతున్నాయి. కారణం వరుస పండుగలు. ఉగాది, రంజాన్ వంటి రెండు పెద్ద పండుగలు ఈ వారంలోనే ఉన్నాయి. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకైతే వరుసగా 4 రోజులు సెలవులు రాబోతున్నాయి. ఇంతకీ ఏ రోజు ఎందుకు సెలవు అంటే..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉగాది సందర్భంగా మార్చి 19న సెలవు ప్రకటించింది ప్రభుత్వం. దీనితో పాటు రంజాన్ పండుగకు సంబంధించి మార్చి 21, మార్చి 22 తేదీలను సాధారణ సెలవులుగా గుర్తిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఈ సెలవులు చంద్ర దర్శనం ఆధారంగా మారే అవకాశం ఉంది. ఒకవేళ మార్చి 19న నెలవంక కనిపిస్తే, పండుగను మార్చి 20న జరుపుకుంటారు. అప్పుడు సెలవుల తేదీల్లో మార్పు ఉంటుంది.
ప్రభుత్వం ప్రకటించిన దాని ప్రకారం మార్చి 19, 21, 22 రోజుల్లో స్కూళ్లు, కాలేజీలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు వంటి వాటికి సెలవు ప్రకటించారు. కొన్ని ప్రైవేటు సంస్థలు ఈ సెలవులు ఇవ్వకపోవచ్చు. ఇదిలా ఉంటే మార్చి 21 శనివారం. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు వీకెండ్. ఆ తర్వాత రోజు ఆదివారం మార్చి 22. ఎలా చూసుకున్నా ఈ వారంలో చాలా మంది ఉద్యోగులకు 3 లేదా 4 రోజులు సెలవులు రాబోతున్నాయి.
