Voter ID Card: ఓటర్ కార్డ్ లేదా? డోంట్ వర్రీ.. ఇలా కూడా ఓటు వేయొచ్చు.. సింపుల్‌గా మీ ఫోన్లోనే ఓటర్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోండి.. పూర్తి వివరాలు
ఓటర్ లిస్ట్ లో పేరున్న వారంతా ఓటర్ ఐడీ కార్డ్ లేకున్నా ఓటు వేయొచ్చని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఓటర్ ఐడీ కార్డు లేని వారు ఈ 12 ప్రత్యామ్నాయ ఫోటో ఐడెంటిటీ కార్డుల్లో ఏదో ఒకటి చూపించి ఓటు వేయొచ్చంది.
Voter ID Card Representative Image (Image Credit To Original Source)
- ఓటర్ ఐడీ కార్డ్ లేకున్నా ఇతర కార్డులను చూపించి ఓటు వేయొచ్చు
- 12 ప్రత్యామ్నాయ ఫోటో ఐడెంటిటీ కార్డుల్లో ఏదో ఒకటి చూపించి ఓటు వేయొచ్చు
- ఫోన్ లోనే ఓటర్ గుర్తింపు కార్డ్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు
Voter ID Card: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్రంలోని 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు పోలింగ్ నిర్వహించనున్నారు. 12వేల 930 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 8వేల 203 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. మొత్తం మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కలిపి 52 లక్షలకు మందికి పైగా ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
ఓటర్ ఐడీ కార్డు లేకున్నా.. ఇలా ఓటు వేయొచ్చు..
ఓటు వేయడానికి ఓటర్లు రెడీ అయ్యారు. అయితే, మీ దగ్గర ఓటర్ ఐడీ కార్డ్ లేదా? ఓటు వేయడం ఎలా? అని కంగారు పడుతున్నారు. ఎలాంటి కంగారు అవసరం లేదంటోంది కేంద్ర ఎన్నికల సంఘం. ఓటర్ ఐడీ కార్డ్ లేకున్నా ఇతర కార్డులను చూపించి తమ ఓటు హక్కు వినియోగించుకోవచ్చని తెలిపింది. ఓటర్ ఐడీ కార్డ్ లేని వారు ఓటు ఎలా వేయాలో, ఏయే గుర్తింపు కార్డులను పోలింగ్ బూత్‌కు తీసుకెళ్లాలో, తమ ఓటు వివరాలను ఎలా తెలుసుకోవాలో తెలుసుకుందాం..
ఓటర్ లిస్ట్ లో పేరున్న వారంతా ఓటర్ ఐడీ కార్డ్ లేకున్నా ఓటు వేయొచ్చని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఓటర్ ఐడీ కార్డు లేని వారు ఈ 12 ప్రత్యామ్నాయ ఫోటో ఐడెంటిటీ కార్డుల్లో ఏదో ఒకటి చూపించి ఓటు వేయొచ్చంది.
1) ఆధార్
2) పాన్
3) డ్రైవింగ్ లైసెన్స్
4) పాస్ పోర్ట్
5) బ్యాంక్ లేదా పోస్టాఫీస్ జారీ చేసిన ఫోటోతో ఉన్న పాస్ బుక్
6) లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా వచ్చిన హెల్త్ ఇన్సూరెన్స్ కార్డ్
7) ఫోటోతో ఉన్న పెన్షన్ డాక్యుమెంట్
8) ఉపాధి హామీ కార్డు
9) NPR స్మార్ట్ కార్డ్
10) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంప్లాయిస్‌కు జారీ చేసిన ఐడీ కార్డులు
11) MP, MLA, MLC అఫీషియల్ ఐడీ కార్డులు
12) దివ్యాంగులకు జారీ చేసిన ఐడీ కార్డుల్లో ఏదో ఒకటి ఎన్నికల అధికారులకు చూపించి ఓటు హక్కును వినియోగించుకోవచ్చు.
ఇక, ఎన్ఆర్ఐలు ఒరిజినల్ పాస్ పోర్టును చూపి ఓటు వేయొచ్చు.
ఓటర్ జాబితాలో మీ వివరాలు ఇలా చెక్ చేసుకోండి..
https://www.eci.gov.in/ వెబ్సైట్ కి వెళ్లి వివరాలను ఎంటర్ చేసి చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర ఫిజికల్‌గా ఓటర్ ఐడీ కార్డ్ లేకపోయినా కంగారు వద్దు. EC e-EPIC ద్వారా పౌరులు తమ ఓటర్ ఐడీ కార్డ్ డిజిటల్ కాపీ PDFతో డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంతేకాదు దీన్ని మీరు డిజిలాకర్‌లోనూ అప్లోడ్ చేయొచ్చు. https://voters.eci.gov.in/login వెబ్సైట్లో ఓటర్ కార్డ్ డిజిటల్ కాపీని ప్రింట్ తీసుకుని పోలింగ్ బూత్‌కు వెళ్లొచ్చు.
ఓటర్ కార్డ్ ను ఫోన్ లోనే ఇలా డౌన్లోడ్ చేసుకోండి..
* https://nvsp.in వెబ్సైట్ ఓపెన్ చేయాలి
* https://voters.eci.gov.in/ యూఆర్ఎల్తో పేజ్ ఓపెన్ అవుతుంది.
* E-EPIC Download పై క్లిక్ చేయాలి. లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది.
* ఎన్ఆర్ఐ ఓటర్లు అయితే ఇండియన్ ఓవర్సీస్ ఎలక్టర్ అనేది సెలక్ట్ చేయాలి.
* లేదంటే ‘ఇండియన్ రెసిడెంట్ ఎలక్టర్’ కింద కనిపించే ఖాళీలో వివరాలు నింపాలి.
* రిజిస్ట్రర్డ్ మొబైల్ నెంబర్ లేదా ఓటర్ గుర్తింపు కార్డ్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడీ వివరాలు ఇవ్వాలి. పాస్వర్డ్, క్యాప్చాలు ఎంటర్ చేసి లాగిన్ కావాలి.
* ఒకవేళ ఇప్పటివరకు రిజిస్టర్ చేసుకోకుంటే లాగిన్ కింద కనిపించే ‘సైన్ అప్’ ఆప్షన్ ఎంచుకుని రిజిస్టర్ చేసుకోవాలి.
ఇలా రిజిస్టర్ చేసుకోండి..
* సైన్ అప్ అనే చోట క్లిక్ చేస్తే వేరే పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ మొబైల్ నెంబర్, ఈ మెయిల్ ఐడీ నింపాలి. ఈ రెండింటిలో మొబైల్ నంబర్ తప్పనిసరిగా నింపాలి.
* క్యాప్చాను నింపి కంటిన్యూ అనే బటన్ ప్రెస్ చేయాలి.
* అక్కడ మీ పేరు, పాస్ వర్డ్ నింపాలి. ‘రిక్వెస్ట్ ఓటీపీ’ అనే బటన్‌పై క్లిక్ చేస్తే మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.
* ఆ ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేస్తే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తవుతుంది.
* మళ్లీ లాగిన్ పేజ్‌లోకి వెళ్లి మొబైల్ నెంబర్, పాస్వర్డ్ నింపి ‘రిక్వెస్ట్ ఓటీపీ’ అనే బటన్ క్లిక్ చేయాలి.
* మొబైల్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది. ఎంటర్ చేసి ‘వెరిఫై అండ్ లాగిన్’ అనే బటన్‌పై క్లిక్ చేయాలి.
* వెంటనే మరో పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీ ఓటర్ గుర్తింపు కార్డ్ నెంబర్ లేదా, ఓటర్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న ఫార్మ్ రిఫరెన్స్ నంబర్ నింపాలి.
* తర్వాత రాష్ట్రం పేరు సెలక్ట్ చేసుకోవాలి.
* దాని కింద సెండ్ ఓటీపీపై క్లిక్ చేయగా ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ నింపి.. వెరిఫై బటన్ క్లిక్ చేయాలి.
* అప్పుడు Download E-EPIC అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయగానే మీ ఓటర్ గుర్తింపు కార్డ్ డౌన్ లోడ్ అవుతుంది.
* పీడీఎఫ్ రూపంలో ఓటర్ కార్డ్ డౌన్ లోడ్ అవుతుంది. దాన్ని ఫోన్ లో కానీ డెస్క్‌టాప్‌లో కానీ ల్యాప్‌టాప్‌లో కానీ సేవ్ చేసుకోవచ్చు.
* లేదంటే డిజిలాకర్‌లో కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. అవసరం అనుకుంటే దాన్ని ప్రింట్ చేయించి లామినేషన్ కూడా చేయించుకోవచ్చు.
పాస్ వర్డ్ మర్చిపోతే…
లాగిన్ అయ్యేటప్పుడు పాస్వర్డ్ తప్పు కొట్టినా, పాస్ వర్డ్ మర్చిపోయినా కంగారు పడాల్సిన పని లేదు. Forget Password ఆప్షన్ ఎంచుకుని అక్కడ వివరాలు నింపి మళ్లీ పాస్ వర్డ్ జనరేట్ చేసుకోవచ్చు.
