Indiramma Indlu Lottery Schedule: సొంతింటి కల నెరవేరే వేళ.. ‘ఇందిరమ్మ ఇండ్ల’ లాటరీ డేట్ ఫిక్స్.. 4 రోజులు ప్రత్యక్ష ప్రసారం
ఇందిరమ్మ ఇండ్ల (Indiramma Indlu Lottery Schedule) కేటాయింపునకు సంబంధించిన లాటరీ ప్రక్రియ షెడ్యూల్ను అధికారులు అధికారికంగా ఖరారు చేశారు.
Hyderabad indiramma indlu lottery schedule announced by government
- ఆగస్టు 28 నుంచి 31 ఇండ్ల లాటరీ
- లాటరీ కార్యక్రమం అంతా లైవ్ ప్రసారం
- దళారుల మాటలు నమ్మవద్దన్న అధికారులు
Indiramma Indlu Lottery Schedule: హైదరాబాద్ నగరంలోని నిరుపేదల సొంతింటి కలను నిజం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. అందులో భాగంగా ఇందిరమ్మ ఇండ్ల (టవర్స్) కేటాయింపునకు సంబంధించిన లాటరీ ప్రక్రియ షెడ్యూల్ను అధికారులు అధికారికంగా ఖరారు చేశారు. నగర పరిధిలోని అర్హులైన లబ్ధిదారులకు పారదర్శకంగా ఇళ్లను అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు.
Chicken Prices: నాన్ వెజ్ ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్ ధరలు.. కేజీ ఎంతో తెలుసా?
లాటరీ నిర్వహణ ప్రత్యక్ష ప్రసారం:
హౌసింగ్ బోర్డు వెల్లడించిన వివరాల ప్రకారం ఆగస్టు 28 నుండి 31 వరకు నాలుగు రోజుల పాటు ఈ లాటరీ ప్రక్రియ జరగనుంది. హైదరాబాద్లోని 16 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో రోజుకు నాలుగు నియోజకవర్గాల చొప్పున డ్రా నిర్వహిస్తారు. ఎటువంటి అక్రమాలకు తావులేకుండా ఉండేందుకు ఈ ప్రక్రియ మొత్తాన్ని యూట్యూబ్లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు హౌసింగ్ బోర్డు ప్రత్యేక అధికారి వీపీ గౌతం తెలిపారు.
దళారుల మాటలు నమ్మవద్దని హెచ్చరిక:
ఇళ్ల (Indiramma Indlu Lottery Schedule)కేటాయింపులో ఎలాంటి రాజకీయం లేదా మధ్యవర్తుల ప్రమేయం ఉండదని అధికారులు స్పష్టం చేశారు. “ఇల్లు ఇప్పిస్తాం” అని డబ్బులు అడిగే దళారులను నమ్మి మోసపోవద్దని ప్రజలను కోరారు. ఈ విడతలో ఇల్లు రాని అర్హులు నిరాశ పడాల్సిన అవసరం లేదని, ఇది పైలట్ ప్రాజెక్ట్ మాత్రమేనని చెప్పారు. భవిష్యత్తులో మొత్తం లక్ష ఇండ్లను నిర్మించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని వివరించారు.
