Adulterated Masala: మసాలాల్లో విషపదార్థాలు.. హెయిర్ కలర్స్, కెమికల్స్ తో తయారీ.. 114 టన్నుల నిల్వలు సీజ్
మసాలా దినుసులను రసాయనాలతో కల్తీ (Adulterated Masala)చేస్తున్న ఒక భారీ ముఠా గుట్టును హెచ్-ఫాస్ట్ (H-FAST) అధికారులు ఇటీవల రట్టు చేశారు.
Hyderabad katedan adulterated masala racket busted hfast raid details
- భారీగా కల్తీ మసాలాలు సీజ్
- ఫ్యాబ్రిక్ డై లతో విషపూరిత తయారీ
- కల్తీదారులపై సజ్జనార్ కఠిన చర్యలు
Adulterated Masala: భాగ్యనగరంలో ఆహార భద్రతను ప్రశ్నార్థకం చేస్తూ కొందరు అక్రమార్కులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నిత్యం వంటింట్లో ఉపయోగించే మసాలా దినుసులను రసాయనాలతో కల్తీ చేస్తున్న ఒక భారీ ముఠా గుట్టును హెచ్-ఫాస్ట్ (H-FAST) అధికారులు ఇటీవల రట్టు చేశారు. హైదరాబాద్‌లోని కాటేదాన్ పరిధిలో అత్యంత ప్రమాదకరమైన రీతిలో సాగుతున్న ఈ నకిలీ వ్యాపారాన్ని పసిగట్టి దాడులు నిర్వహించడం పట్ల సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. తక్కువ ధరలకు ఆశపడి నాసిరకం వస్తువులను కొనుగోలు చేసే సామాన్యులను లక్ష్యంగా చేసుకుని ఈ దందాను విస్తరిస్తున్నట్లు స్పష్టమవుతోంది.
UPI Charges: UPI యూజర్లకు బిగ్ షాక్.. రూ.2000 దాటితే చార్జీలు.. ఎవరు కట్టాలి, ఎంత కట్టాలి?
ఫ్యాబ్రిక్ డైలతో కల్తీ, దిగ్భ్రాంతికర వివరాలు:
ఈ మెరుపు దాడుల్లో అధికారులు ఏకంగా 25 టన్నుల నకిలీ మసాలాలను(Adulterated Masala), 89 టన్నుల కల్తీ నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. లవంగాలు, జీలకర్ర, షాజీరా వంటి దినుసులకు రంగు, మెరుపు తీసుకురావడానికి ఇండస్ట్రియల్ ఫ్యాబ్రిక్ డైలు, సింథటిక్ కలర్స్, టాల్కమ్ పౌడర్, ఏకంగా హెయిర్ కలర్లను కూడా ఉపయోగిస్తున్నట్లు తెలిసింది. నూనె తీసేసిన లవంగాల చెత్తకు కేమికల్స్ కలిపి, ప్రముఖ బ్రాండ్ల పేరిట విక్రయిస్తున్నారని హైదరాబాద్ సీపీ సజ్జనార్ వెల్లడించారు. ఈ ప్రాసెసింగ్ కోసం ఇండోర్ నుంచి ప్రత్యేక యంత్రాలు తెప్పించినట్లు గుర్తించారు.
క్యాన్సర్ ప్రమాదం, పోలీసుల కఠిన చర్యలు:
ఇలాంటి కేమికల్ కల్తీ ఆహారం తీసుకోవడం వల్ల క్యాన్సర్, కాలేయం, మూత్రపిండాల వ్యాధులు వచ్చే తీవ్ర ప్రమాదముందని అధికారులు హెచ్చరించారు. హెచ్-ఫాస్ట్ ఏర్పడిన 140 రోజుల్లోనే 659 ప్రాంతాల్లో దాడులు చేసి 246 టన్నుల కల్తీ ఆహారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. స్వాధీనం చేసుకున్న నమూనాలను ల్యాబ్‌కు పంపామని, ఆహార భద్రతా చట్టం కింద కల్తీదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎక్కడైనా అనుమానాస్పద తయారీ కేంద్రాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
