Hyd Techie Suicide : సీతారాం ఆత్మహత్య కేసులో విస్తుపోయే వాస్తవాలు.. పెళ్లికి ముందు ఆరుగురు.. పెళ్లి తర్వాత ముగ్గురు.. ప్రియుడికి ప్రైవేట్ వీడియోలు
Hyd Techie Suicide : హైదరాబాద్ టెకీ సీతారాం హత్య కేసులో రోజురోజుకీ కొత్త విషయాలు తెర మీదకు వస్తున్నాయి.
- Dharani Pilli
- Updated on- May 1, 2026 / 06:18 PM IST
hyderabad software engineer suicide letter reveals his wife renuka illicit affairs
Hyd Techie Suicide : భార్య బూతు పురాణాన్ని తట్టుకోలేని ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సీతారాం.. ఆమె నెరుపుతున్న అక్రమ సంబంధాలు, ప్రేమ వ్యవహారాల గురించి విపులంగా వివరిస్తూ 19 పేజీల సుదీర్ఘ సూసైడ్ నోట్ రాసి హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్యకు పాల్పడిన వైనం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా నిలిచింది. భార్య అరాచకాల గురించి తెలుసుకున్న సీతారాం.. ఆమెను బుద్ధి మార్చుకోమని కోరినా వినలేదు సరే కదా, మరింత రెచ్చిపోయింది. ఆమెతో కలిసి జీవించలేనని తెలుసుకున్న సీతారాం ఆత్మహత్య చేసుకుని తనువు చాలించాడు. ఈ కేసు దర్యాప్తులో రోజురోజుకు విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి.
తన భార్య అరాచకాలను వివరిస్తూ సీతారాం రాసిన సూసైడ్ నోట్ ప్రతి ఒక్కరి గుండెల్ని పిండేస్తుంది. తన భార్య రేణుకకు పెళ్లికి ముందే 6 ప్రేమ కథలు ఉన్నాయని.. పెళ్లైన తర్వాత ముగ్గురితో వివాహేతర సంబంధాలు కొనసాగించిందని సీతారాం తెలిపాడు. పైగా వారితో సన్నిహితంగా ఉన్న సమయంలో తీసుకున్న ప్రైవేట్ వీడియోలను.. తన భార్య ఆమె ప్రియుడి రమణారెడ్డికి షేర్ చేసిందని సీతారాం సూసైడ్ నోట్‌లో ప్రస్తావించాడు. అయితే రేణుక ప్రియుడు ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
ఇన్‌స్టాలో ప్రైవేటు వీడియోలు
ఈ క్రమంలో సీతారాం స్వయంగా రమణారెడ్డిని కలిసి.. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియోలు డిలీట్ చేయాలని కోరాడు. కానీ రమణ వాటిని డిలీట్ చేయలేదు.. పైగా పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసినట్లు వెల్లడించాడు. అతడు డిలీట్ చేయనని చెప్పి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలిపాడు. దీంతో ఈ విషయం గురించి పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్తే.. వారు తమను పట్టించుకోలేదని సీతారాం ఆవేదన వ్యక్తం చేశాడు.
పైగా సీతారాం తన భార్యతో పోలీస్ స్టేషన్‌లో ఉండగానే రమణ మరోసారి వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసినట్లు తెలిపాడు. దీంతో తన భార్య రేణుక బాధగా అక్కడ నుంచి వెళ్లిపోయిందని.. అయితే ఆమె ఆత్మహత్య చేసుకునేందుకు వెళ్లిందేమో అనే భయంతో తాను వెతుక్కుంటూ వెళ్లగా.. తన భార్య రేణుక రమణ ఇంట్లో ఉందని సీతారాం తెలిపాడు. ఇక వీడియోలు డిలీట్ చేయాలని వాగ్వాదానికి దిగగా.. అతడు చేయలేదని.. దీంతో రమణ తాగిన పురుగుల మందునే.. రేణుక కూడా తాగి చనిపోవడానికి ప్రయత్నించిందని సీతారాం సూసైడ్ నోట్‌లో రాసుకొచ్చాడు.
మారినట్లుగా నటించింది
వెంటనే రేణుకను ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించాడు. ఆ తర్వాత రేణుక తండ్రిని పిలిపించి.. ఆమెను పుట్టింటికి పంపించినట్లు తెలిపాడు. 2 నెలల తర్వాత అన్ని మర్చిపోయి కలిసి ఉందామని భార్య రేణుకను సీతారాం ఇంటికి తీసుకువచ్చాడు. వచ్చాక రెండు నెలలు రేణుక బాగానే ఉందని.. దీంతో భార్య మారిపోయిందని తాను కూడా నమ్మానన్నాడు. అయితే కొన్ని రోజుల్లోనే రేణుక తన నమ్మకాన్ని వమ్ము చేసిందని తెలిపాడు.
8 రోజులు మిస్సింగ్
ఒకరోజు రేణుక తమ 3 ఏళ్ల కుమారుడిని ఒంటరిగా ఇంట్లోనే వదిలేసి.. బయటికి వెళ్లిందని తెలిపాడు. ముఖానికి స్కార్ఫ్ కట్టుకుని.. ప్రూఫ్ లేకుండా కొత్త సిమ్ కార్డు కొనేందుకు ప్రయత్నించిందని.. రమణ స్టేటస్ లు కూడా చూసిందని గుర్తించాడు. అలా కొడుకుని ఒంటరిగా ఇంట్లో వదిలేసి వెళ్లిన రేణుక 8 రోజులైనా తిరిగిరాలేదు. భార్య చేసిన మోసాన్ని తట్టుకోలేకపోయిన సీతారాం.. తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు.
తన భార్యకు ఎలాంటి లోటు చేయలేదని… కానీ ఆమె తనకు నమ్మక ద్రోహం చేసిందని.. ఇన్ని దారుణాలను తట్టుకుని తాను బతికి ఉండలేనని.. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు పేర్కొంటూ.. సూసైడ్ లెటర్ రాసి హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య బాగోతాలను వివరిస్తూ.. రాసిన 19 పేజీల సూసైడ్ లెటర్‌ని తన సోషల్ మీడియా స్టేటస్‌గా పెట్టి.. ప్రాణాలు తీసుకున్నాడు.
సీతారాం కేసులో రమణారెడ్డిని అరెస్ట్ చేయడంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని… అలానే తమ కొడుకు ఆత్మహత్య చేసుకుని 3 నెలలు దాటినా నిందితులను ఇంకా అరెస్ట్ చేయలేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురానికి చెందిన సీతారాంకు.. నంద్యాలకు చెందిన రేణుకకు 2018లో వివాహం జరిగింది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
