Traffic Diversions at Gachibowli : హైదరాబాద్ వాహనదారులకు అలర్ట్.. ఆ ప్రాంతంలో ఏకంగా ఏడాది పాటు ట్రాఫిక్ డైవర్షన్స్..
Traffic Diversions at Gachibowli : హైదరాబాద్ వాహనదారులకి ట్రాఫిక్ పోలీసులు కీలక అలర్ట్ జారీ చేశారు. ఆ మార్గంలో ఏడాది పాటు ట్రాఫిక్ డైవర్షన్స్ అమల్లో ఉంటాయని తెలిపారు.
- Dharani Pilli
- Published On : April 8, 2026 / 05:48 PM IST
Hyderabad traffic diversions at gachibowli and iiit junction from 2026 april 8
- నగరవాసులకు అలర్ట్
- గచ్చిబౌలి IIIT జంక్షన్ మార్గాల్లో ట్రాఫిక్ డైవర్షన్లు
- ఏడాది పాటు అమలు
Traffic Diversions at Gachibowli : నగరవాసులకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక అలర్ట్ జారీ చేశారు. గచ్చిబౌలి IIIT జంక్షన్, పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇవి ఏకంగా ఏడాది పాటు అమల్లో ఉంటాయని తెలిపారు. అయితే ఇంత సుదీర్ఘకాలం ట్రాఫిక్ డైవర్షన్స్ విధించడానికి కారణం.. ఈ ప్రాంతంలో మల్టీ లెవల్ ఫ్లైఓవర్, అండర్‌పాస్ నిర్మాణ పనులు కొనసాగుతుండటమే. దీంతో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇవి నేటి నుంచే అనగా బుధవారం, 08 ఏప్రిల్ 2026 నుంచే అమల్లోకి వస్తాయి. ట్రాఫిక్ డైవర్షన్స్ ప్రతి రోజు ఉదయం 08:00 గంటల నుంచి రాత్రి 09:00 గంటల వరకు అమల్లో ఉంటాయి.
ప్రభావిత మార్గాలు:
గచ్చిబౌలి జంక్షన్, IIIT జంక్షన్, గచ్చిబౌలి స్టేడియం, HCU గేట్ నెం. 2, లింగంపల్లి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గోపన్‌పల్లి, తండా, గౌలిదొడ్డి, క్యూ సిటీ, విప్రో జంక్షన్ మార్గాల్లో ప్రయాణించే వారిపై ఈ ట్రాఫిక్ డైవర్షన్స్ ప్రభావం చూపుతాయి.
ట్రాఫిక్ డైవర్షన్స్ ఇలా:
- గచ్చిబౌలి నుంచి లింగంపల్లి వెళ్లే వాహనాలను: IIIT జంక్షన్ → విప్రో జంక్షన్ → కుడివైపు మలుపు → గౌలిదొడ్డి → గోపన్‌పల్లి జంక్షన్ → నల్లగండ్ల → లింగంపల్లి వైపు మళ్లిస్తున్నారు.
- లింగంపల్లి నుంచి గచ్చిబౌలి వెళ్లే వాహనాలను: SMR/HCU బస్ డిపో → మసీద్‌బండ → శ్రీరామ్‌నగర్ → బొటానికల్ జంక్షన్ → కుడివైపు మలుపు → ఉడుపి హోటల్ → యూ-టర్న్ → ZPHS గచ్చిబౌలి → గచ్చిబౌలి జంక్షన్ దిశగా డైవర్ట్ చేస్తున్నారు.
- గౌలిదొడ్డి / క్యూ సిటీ / కోకాపేట్ నుంచి IIIT వైపుగా వెళ్లే వాహనాలను: విప్రో జంక్షన్ → నానక్రామ్‌గూడ రోటరీ-2 → ఎడమవైపు మలుపు → ORR → గచ్చిబౌలి జంక్షన్ వైపు మళ్లిస్తున్నట్లు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు.
సుమారు ఏడాది పాటు ఈ డైవర్షన్స్ ప్రతి రోజు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అమల్లో ఉంటాయని తెలిపారు. ఈ మేరకు వాహనదారులు తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని.. ఈ డైవర్షన్స్ విషయంలో ప్రజలు సహకరించాలని పోలీసులు కోరుతున్నారు.
