హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్‌తో పాటు హైదరాబాద్‌లో ఎవరెవరి అక్రమ నిర్మాణాలను కూల్చేశారో తెలుసా?
మొత్తం 18 ప్రాంతాల్లో జరిపిన కూల్చివేతల్లో 43 ఎకరాల స్థలాన్ని హైడ్రా కాపాడింది.
హైదరాబాద్‌లో అక్రమ భవనాల కూల్చివేతలపై ప్రభుత్వానికి హైడ్రా నివేదిక ఇచ్చింది. 18 ప్రాంతాల్లో కూల్చివేతలు జరిగినట్లు ప్రభుత్వానికి నివేదిక. పలువురు వీఐపీలతో పాటు రియల్ ఎస్టేట్ సంస్థల కబ్జా నిర్మాణాలపై కూల్చివేతలు జరిగాయి. 18 ప్రాంతాల్లో జరిపిన కూల్చివేతల్లో 43 ఎకరాల స్థలాన్ని హైడ్రా కాపాడింది.
పూర్తి వివరాలు
- నంది నగర్ లో ఎకరం స్థలాన్ని కబ్జాకార నుంచి కాపాడిన హైడ్రా
- లోటస్ పాండ్ లో పార్కు కాంపౌండ్ వాల్ కబ్జా చేసిన దానిని కాపాడిన హైడ్రా
- మనసురాబాద్ సహారా ఎస్టేట్‌లో కబ్జాలు కూల్చివేత
- ఎంపీ ఎమ్మెల్యే కాలనీలో పార్కు స్థలం కబ్జా కూల్చివేత
- మిథాలీ నగర్ లో పార్కు స్థలాన్ని కాపాడిన హైడ్రా
- బిజెఆర్ నగర్ లో నాలా కబ్జా నుంచి కాపాడిన హైడ్రా
- గాజులరామారం మహాదేవ్ నగరంలో రెండంతస్తుల భవనం కూల్చివేత
- గాజుల రామారావు భూదేవి హిల్స్ లో చెరువు ఆక్రములను చేసిన బోనాలు కూల్చివేత
- బంజారా హిల్స్ లో ఆక్రమించుకున్న రెస్టారెంట్ భవనం కూల్చివేత
- చింతల్ చెరువులో కబ్జాలను కూల్చివేసిన హైడ్రా
- నందగిరి హిల్స్‌లో ఎకరం స్థలం కబ్జాలు కూల్చివేత
- నందగిరి హిల్స్ కబ్జాలను అడ్డుకునేందుకు వచ్చిన ఎమ్మెల్యే దానం నాగేందర్ పై కేసు నమోదు.
- రాజేంద్రనగర్ చెరువులు కబ్జాలు కూల్చివేత
- ఎంఐఎం ఎమ్మెల్యే మోబిన్ నిర్మిస్తున్న భవనం కూల్చివేత
- ఎంఐఎం ఎమ్మెల్సీ సి మిర్జా బేగ్ నిర్మించిన రెండంతస్తుల భవనం కూల్చివేత.
- చందానగర్ ఏర్ల చెరువులో కబ్జాలు కూల్చివేత
- ప్రగతి నగర్ ఎర్రగుంట లో నిర్మించిన అక్రమ కట్టడాలు కూల్చివేత
- బోడుప్పల్ చెరువులో నిర్మించిన ఆక్రమణలు కూల్చివేత
- గండిపేట చెరువులో నిర్మించిన ఫామోజులు కూల్చివేత
- మాజీ కేంద్ర మంత్రి పల్లంరాజు సంబంధించిన ఒరో స్పోర్ట్ కూల్చివేత
- టీటీడీ మాజీ సభ్యుడు కావేరి సీడ్స్ యజమాని ఫామ్ హౌస్ కూల్చివేత
- బిజెపి నేత సునీల్ రెడ్డి ఫామ్ హౌస్ కూల్చివేత
- ప్రో కబడ్డీ యజమాని అనుపమ ఫామ్ హౌస్ కూల్చివేత
- మాదాపూర్ లోని నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేత
166 అక్రమ నిర్మాణాలు కూల్చివేత - ప్రభుత్వానికి హైడ్రా నివేదిక
- 18 చోట్ల కూల్చివేతలు
- 43 ఎకరాల ప్రభుత్వ భూమి రికవరీ
Also Read: అందుకే హైడ్రా పేరుతో నిర్మాణాలు కూల్చేస్తున్నారు: బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి