Indiramma Indlu 2 Phase: ‘ఇందిరమ్మ ఇళ్ల’ రెండో విడతపై బిగ్ అప్డేట్.. 2.5 లక్షల కొత్త ఇళ్లు కేటాయింపు.. లాస్ట్ డేట్ ఇదే!
ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మొదటి విడత నిర్మాణాలను వేగవంతం చేసి గృహప్రవేశాలకు సిద్ధం చేయడంతో పాటు, తాజాగా రెండో విడత(Indiramma Indlu 2 Phase) మంజూరుపై దృష్టి సారించింది.
Indiramma indlu second phase sanction and beneficiary selection details
- రెండవ విడత ఇందిరమ్మ ఇళ్లు
- నిరుపేదలకు ప్రాధాన్యతతో ఉచిత సాయం
- సెప్టెంబర్ నాటికి పూర్తి ఎంపిక
Indiramma Indlu 2 Phase: రాష్ట్రంలో సొంతింటి కల నెరవేర్చుకోవాలని చూస్తున్న నిరుపేదలకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మొదటి విడత నిర్మాణాలను వేగవంతం చేసి గృహప్రవేశాలకు సిద్ధం చేయడంతో పాటు, తాజాగా రెండో విడత(Indiramma Indlu 2 Phase) మంజూరుపై దృష్టి సారించింది. ఈ నూతన విడతలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2.50 లక్షల మంది అర్హులైన పేద కుటుంబాలకు కొత్త ఇళ్లను కేటాయించేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది.
Aadhaar Update: పిల్లల ఆధార్లో బిగ్ అప్డేట్.. ఈ నిబంధనలు పాటించకపోతే కష్టమే.. UIDAI కీలక సూచనలు
గుడిసెల్లో నివసించే వారికే తొలి ప్రాధాన్యత:
రెండో విడత పథకం అమలు కోసం ప్రభుత్వం ఏకంగా రూ.10,400 కోట్లను కేటాయించింది. సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మించుకునే లబ్ధిదారులకు రూ. 5 లక్షల ఆర్థిక సాయాన్ని నాలుగు విడతల్లో అందించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో దాదాపు 50 వేల కుటుంబాలు ఇప్పటికీ గుడిసెల్లోనే నివసిస్తున్నట్లు అధికారులు గుర్తించగా, ఇళ్ల కేటాయింపుల్లో వీరికే మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. హైదరాబాద్ నియోజకవర్గాలను మినహాయించి, మిగిలిన 100 నియోజకవర్గాల్లో ఒక్కో ప్రాంతానికి 2,500 ఇళ్ల చొప్పున పంపిణీ చేయనున్నారు.
సెప్టెంబర్ 15 నాటికి ఎంపిక పూర్తి:
ఈ పథకం కింద లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను సెప్టెంబర్ 15 నాటికి పూర్తి చేసి మంజూరు పత్రాలు అందజేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కలెక్టర్లు రూపొందించిన తుది జాబితాను జిల్లా ఇంచార్జ్ మంత్రుల ఆమోదానికి పంపనున్నారు. అంతేకాకుండా, పాత ఇళ్ల పైకప్పుల ఆధునీకరణ కోసం ‘రూఫ్ పునఃప్రారంభం’ కింద 70 వేల ఇళ్లకు ఒక్కో నియోజకవర్గానికి 700 ఇళ్ల చొప్పున రూ. 2 లక్షల ఆర్థిక సాయం అందించేందుకు చర్యలు చేపడుతున్నారు.
