Abhinand Kumar Shavili: కోర్టుకెక్కిన న్యాయమూర్తి.. సొంత భూములపైనే వివాదం.. చివరికి ఏం జరిగిందో తెలుసా?
హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ అభినందన్ కుమార్ షావిలి(Abhinand Kumar Shavili), తనకు జరిగిన అన్యాయంపై అదే న్యాయస్థానాన్ని ఆశ్రయించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Justice abhinand kumar shavili challenges assigned land order
- హైకోర్టును ఆశ్రయించిన రిటైర్డ్ న్యాయమూర్తి.
- భూములను నిషేధిత జాబితాలో చేర్చడంపై.
- విచారణ ఈ నెల 16కు.
Abhinand Kumar Shavili: న్యాయాన్ని గెలిపించాల్సిన న్యాయమూర్తి కోర్టు మెట్లు ఎక్కితే ఎలా ఉంటుంది. తాజాగా, అదే సంఘటన జరిగింది. అనేక సంచలన కేసుల్లో కీలక తీర్పులు ఇచ్చి పదవీ విరమణ చేసిన హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ అభినందన్ కుమార్ షావిలి(Abhinand Kumar Shavili), తనకు జరిగిన అన్యాయంపై అదే న్యాయస్థానాన్ని ఆశ్రయించడం ప్రాధాన్యత సంతరించుకుంది. తనకు, తన సోదరుడు అశోక్ కుమార్ షావిలికి చెందిన భూములను రిజిస్ట్రేషన్ యాక్ట్-1908 సెక్షన్ 22-ఏ ప్రకారం నిషేధిత జాబితాలో చేర్చడాన్ని సవాలు చేస్తూ ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
Telegram Ban: భారత్ లో ‘టెలిగ్రామ్’ బ్యాన్.. కేంద్రం షాకింగ్ నిర్ణయం.. కారణం ఏంటంటే?
తమ సొంత భూములను ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా నిషేధిత జాబితాలో పెట్టడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం గుబ్బడి గ్రామంలోని సర్వే నెంబర్ 103/45ఏఏ లో తనకు ఉన్న 3.26 ఎకరాల భూమిని, అలాగే సర్వే నెంబర్ 10/45 లో తన సోదరుడికి ఉన్న 1.04 ఎకరాల భూమిని నిషేధిత జాబితాలో చేర్చినట్లు జస్టిస్ షావిలి తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ భూములను తాము 1980వ దశకంలోనే చట్టబద్ధంగా కొనుగోలు చేశామని, అప్పటి నుండి అవి తమ ఆధీనంలోనే ఉన్నాయని స్పష్టం చేశారు.
ఎలాంటి సరైన రికార్డులు లేదా ఆధారాలు లేకుండా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ 2025లో ఈ భూములను అసైన్డ్ భూములుగా గుర్తిస్తూ ఉత్తర్వులు ఇవ్వడం పూర్తిగా చట్టవిరుద్ధమని ఆయన కోర్టుకు తెలిపారు. ఈ పిటిషన్ సోమవారం నాడు హైకోర్టులో జస్టిస్ ఎన్.వి. శ్రవణ్ కుమార్ ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. అయితే, ఈ వివాదం స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించిన అంశం కావడంతో, ఈ రకమైన కేసులను విచారించే ప్రత్యేక రోస్టర్ ఉన్న ధర్మాసనం ముందుకు దీనిని పంపాలని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. ఈ మేరకు తదుపరి విచారణను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేస్తూ, సంబంధిత ధర్మాసనం ఎదుట కేసును ఉంచాలని ఆదేశించారు.
