Danam Nagender : దానం నాగేందర్‌ను టెన్షన్ పెడుతున్న గత ఉపఎన్నిక..! ఈసారి మంత్రిగా బరిలోకి?
Danam Nagender : దానం నాగేందర్ కాంగ్రెస్‌లో చేరినప్పటి నుంచి మంత్రి పదవి కోరుతున్నట్లు ప్రచారం నడుస్తుంది. ఇప్పుడు మంత్రి అయ్యే ఛాన్స్ ఉందనే టాక్ తెరపైకి వచ్చింది.
Danam Nagender
Danam Nagender : ఖైరతాబాద్ ఉప ఎన్నికపై సస్పెన్స్ వీడింది. దానం నాగేందర్ అనర్హుడని దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా క్లియర్ కట్‌గా చెప్పేసింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు..ఉప ఎన్నికల్లో పోటీ చేసుకోవాల్సిందేనని తేల్చి చెప్పింది. దీంతో ఖైరతాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్‌కు బైపోల్ రావడం ఖాయమైంది. అయితే, సుప్రీంకోర్టు తీర్పును ముందే ఊహించానంటున్న దానం.. లోక్‌సభ ఎన్నికల్లో ఓడినప్పుడే.. ఉప ఎన్నిక వస్తుందని భావించానని అంటున్నారు. ఉప ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పేశారు.
Also Read : Telangana Govt : 22ఏ భూములపై తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. హైదరాబాద్‌లో రిజిస్ట్రేషన్లకు గ్రీన్ సిగ్నల్!
వాస్తవానికి దానం నాగేందర్ చాలాకాలం నుంచి ఉప ఎన్నికపై ఫోకస్ పెట్టారట. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో పాటు ఖైరతాబాద్ సెగ్మెంట్‌కు కూడా బైఎలక్షన్ తేవాలని అనుకున్నారట. ఫిరాయింపు ఎపిసోడ్లో భాగంగా హుందాగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బైఎలక్షన్‌ను ఫేస్ చేయాలని అనుకున్నారట. కానీ, అప్పటి పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వ పెద్దలు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వలేదన్న చర్చ ఉంది. జూబ్లీహిల్స్‌తో పాటు ఖైరతాబాద్కుకూడా ఉప ఎన్నిక వస్తే రెండింటిని డీల్ చేయడం ఈజీ కాదని భావించారట. అంతేకాదు బైపోల్ రిజల్ట్స్‌లో తేడా వస్తే.. ప్రభుత్వ మనుగడకే ప్రమాదమన్న వాదనలు అప్పట్లో తెరపైకి రావడంతో దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా వెనకడుగు వేశారని అంటున్నారు.
సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఉపఎన్నికకు రెడీ అంటూనే దానం నాగేందర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 2004లో ఆసిఫ్‌నగర్ ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఉపఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారు. ఈ సెంటిమెంట్ ఆయన్ను వెంటాడుతుందన్న చర్చ నడిచింది. అయితే, దానం మాత్రం ఉప ఎన్నికలో తలపడితే తనకు ప్రమోషన్ వచ్చిందని గుర్తు చేసుకుంటున్నారు. 2004లో కాంగ్రెస్‌లో చేరి బైఎలక్షన్ పోటీ చేసి ఓడినా.. ఆ తర్వాత గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ ప్రెసిడెంట్‌గా.. ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రమోషన్ దక్కిందని చెప్పుకుంటున్నారు. అయితే, ఈ సారి మాత్రం ఉప ఎన్నిక కంటే ముందే దానం ప్రమోషన్ కోరుకుంటున్నారని.. ప్రభుత్వ పెద్దలు కూడా ఆయనకు ప్రమోషన్ ఇచ్చే ఉప ఎన్నికకు వెళ్లాలని భావిస్తున్నారట. ఇదేం లెక్క అంటే దానికో ఈక్వేషన్ ఉంది. అదో గెలుపు మంత్రం అంటున్నారట దానం.
దానం నాగేందర్ కాంగ్రెస్‌లో చేరినప్పటి నుంచి మంత్రి పదవి కోరుతున్నట్లు ప్రచారం నడుస్తుంది. ఇప్పుడు మంత్రి అయ్యే ఛాన్స్ ఉందనే టాక్ తెరపైకి వచ్చింది. గ్రేటర్ హైదరాబాద్‌లో కాంగ్రెస్‌కు బలమైన నాయకుడు లేరన్న చర్చ ఉంది. త్వరలో రానున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలనుకూడా సమర్థవంతంగా ఎదుర్కొవాలంటే సిటీలో స్ట్రాంగ్ లీడర్ ఉండాలని కాంగ్రెస్ ఆలోచిస్తోందట. దానం నాగేందర్ గతంలో గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉన్నందున.. ఇప్పుడు ఆయనకు మంత్రిగా ప్రమోషన్ ఇస్తే.. ఇటు ఉప ఎన్నిక.. అటు గ్రేటర్ ఎన్నికలు.. అన్ని ఈక్వేషన్లు సెట్ అవుతాయనే ఆలోచన చేస్తున్నారట ప్రభుత్వ పెద్దలు.
కొండా సురేఖ బర్తరఫ్ తర్వాత ప్రస్తుతం క్యాబినెట్లో మూడు బెర్తులు ఖాళీగా ఉన్నాయి. కొండా సురేఖ ప్లేస్‌లో అదే మున్నూరుకాపు సామాజికవర్గం నుంచి ఒకరికి ఛాన్స్ ఇవ్వాలని ప్రభుత్వ పెద్దలు ఆలోచన చేస్తున్నారట. దానం నాగేందర్ కూడా మున్నూరుకాపే కావడం.. గ్రేటర్ ఎన్నికల లెక్కలు పైగా ఉప ఎన్నికను ఫేస్ చేయాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడటంతో.. ఆయన్ను క్యాబినెట్లోకి తీసుకొని బైపోల్ బరిలోకి దించేందుకు రంగం చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.
మంత్రిగా ఉప ఎన్నికలను సునాయాసంగా ఫేస్ చేయొచ్చని దానం కూడా భరోసా ఇస్తున్నారట. మంత్రిగా ఉంటే.. బైఎలక్షన్లో కొన్ని ఫ్యాక్టర్స్ కలిసి వస్తాయని దానం చెప్పుకొస్తున్నారట. అందుకే ప్రభుత్వ పెద్దలు కూడా త్వరలో జరిగే క్యాబినెట్ విస్తరణలో దానంకు చోటు కల్పించే యోచనలో ఉన్నారట. అయితే, ఆసీఫ్ నగర్ ఉప ఎన్నికలో ఓడిన సెంటిమెంట్ మాత్రం దానంను టెన్షన్ పెడుతూనే ఉందని అంటున్నారు. ఈసారి ముందే మంత్రి కావాలని ఆశ పడుతున్నది కూడా అందుకేనని.. ఒకవేళ మంత్రివర్గంలోకి తీసుకుంటే ఎమ్మెల్యేగా ఓడిపోయినా.. ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి అయినా క్యాబినెట్లో కొనసాగిస్తారనే అంచనాలు కూడా ఉన్నాయట. దానం లెక్కలేంటో.. ప్రభుత్వ పెద్దల ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయో వేచి చూడాలి మరి.
