Telangana Rains: తెలంగాణలో మారిపోయిన వాతావరణం.. రాబోయే 3 రోజులు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ కీలక హెచ్చరిక!
తెలంగాణలో రాబోయే మూడ్రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు (Telangana Rains)కురిసే అవకాశముంది.
Meteorological Department has forecast heavy rains in Telangana for next three days.
Telangana Rains: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రానున్న మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఈ క్రమంలో వర్ష తీవ్రత పెరిగే సూచనలు ఉండటంతో ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.
వివిధ జిల్లాలకు రెయిన్ అలర్ట్.. ఈదురుగాలుల ముప్పు:
ఉమ్మడి ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో రాబోయే మూడు రోజులు మోస్తరు నుండి భారీ వర్షాలు(Telangana Rains) కురిసే అవకాశముంది. వర్షంతో పాటు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
పిడుగులు పడే ప్రమాదం.. వాతావరణ శాఖ సూచనలు:
కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడే ప్రమాదం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రత్యేక హెచ్చరికలు జారీ చేసింది. వర్షం పడే సమయంలో ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో ఉండవద్దని, చెట్ల కిందగానీ, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్ల వద్ద నిలబడవద్దని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్త వహించాలని అధికారులు కోరారు.
