Telangana Rains : తెలంగాణకు మూడ్రోజులు భారీ వర్ష సూచన.. ఈ జిల్లాల్లో భీకరగాలులతో దంచికొట్టనున్న వానలు
Telangana Rains : తెలంగాణలో జులై 3 నుంచి 5వ తేదీ వరకు మూడు రోజులు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.
Telangana Rains
- తెలంగాణకు మూడ్రోజులు రెయిన్ అలర్ట్
- పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు
- హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ
Telangana Rains : తెలంగాణలో గత వారంరోజులుగా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణ మేఘావృతమైంది. ప్రస్తుతం పలు జిల్లాల్లో భారీ వర్షాలు నమోదవుతుండగా.. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఇదే సమయంలో వాతావరణ శాఖ వర్షాలపై మరో బిగ్ అప్డేట్ ఇచ్చింది. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయి. ఈ కారణంగా పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
Also Read : Flight Tickets: విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. టికెట్ల ధరలు భారీగా తగ్గించనున్న ‘ఎయిరిండియా’
తెలంగాణలో జులై 3 నుంచి 5వ తేదీ వరకు మూడు రోజులు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. జులై 4, 5 తేదీల్లో అదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, పెద్దపల్లి తదితర జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది.
వర్షాలతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా భీకర గాలులు వీస్తాయని, ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. జులై 6 నుంచి 10వ తేదీ వరకు కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
వర్షాలు, ఈదురుగాలుల సమయంలో ప్రజలు అప్రమ్తతంగా ఉండాలని, చెట్లు కింద, విద్యుత్ స్తంభాల వద్ద, భారీ హోర్డింగ్ లు ఉన్న ప్రాంతాల్లో ఉండొద్దని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని వాతావరణ శాఖ సూచనలు చేసింది.
