Telangana Rains: తెలంగాణలో పూర్తిగా మారిన వాతావరణం.. రానున్న రెండు రోజులు వర్షాలు.. వాతావరణ శాఖ కీలక హెచ్చరిక!
ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో రానున్న రెండు రోజుల పాటు విస్తారంగా వర్షాలు(Telangana Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
Meteorological Department issued forecast heavy rains in Telangana for next two days
- రెండు రోజులు భారీ వర్షాలు
- పలు జిల్లాలకు వర్ష అలర్ట్
- హైదరాబాద్‌లో ఈదురుగాలులతో వానలు
Telangana Rains: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో రానున్న రెండు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు తీవ్రరూపం దాల్చడంతో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం పూర్తిగా చల్లబడింది. పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉండటంతో, ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు పదే పదే సూచిస్తున్నారు.
Nepal Earthquake: భయంతో వణికిపోతున్న నేపాల్.. మొన్న వరదలు.. ఇప్పుడు భూకంపం.. 3.8 తీవ్రత
పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్‌లు జారీ:
రాష్ట్రంలోని ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు(Telangana Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు సదరు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌లను జారీ చేశారు. గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపారు.
హైదరాబాద్‌పై వర్ష ప్రభావం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి:
రాజధాని హైదరాబాద్ నగరం, దాని పరిసర ప్రాంతాలలో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ముంపు ప్రాంతాల ప్రజలు, వాహనదారులు ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని జీహెచ్ఎంసీ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలవకుండా చర్యలు చేపడుతున్నట్లు స్పష్టం చేశారు.
