MLC Son Arrest: డ్రగ్స్ కొంటూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికారు.. ఎమ్మెల్సీ కొడుకుతో పాటు మరో ముగ్గురు అరెస్ట్!
హైదరాబాద్‌లోని మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో మాదకద్రవ్యాల(MLC Son Arrest) నిరోధానికి పోలీసులు చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో భారీ ముఠా గుట్టు రట్టయింది.
MLC son caught red handed by police while buying drugs at Mangalhat
- మంగళ్‌హాట్ పరిధిలో డ్రగ్స్ కలకలం
- ఎమ్మెల్సీ కుమారుడితో సహా అరెస్ట్
- నిందితులకు వైద్య పరీక్షల నిర్వహణ
MLC Son Arrest: హైదరాబాద్‌లోని మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో మాదకద్రవ్యాల నిరోధానికి పోలీసులు చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో భారీ ముఠా గుట్టు రట్టయింది. బుధవారం రాత్రి ఈగల్ టీమ్, లా అండ్ ఆర్డర్, ఎక్సైజ్ పోలీసులు ఉమ్మడిగా నిర్వహించిన దాడుల్లో డ్రగ్స్ కొనుగోలు చేసేందుకు వచ్చిన ఓ ఎమ్మెల్సీ కుమారుడితో పాటు మరో ముగ్గురు వ్యక్తులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. పక్కా సమాచారంతో నిఘా పెట్టిన రక్షక భట నిధులు.. డ్రగ్స్ సరఫరాదారుడి కోసం గాలిస్తున్న సమయంలో ఈ నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.
Jagananna 2.0 Super App: నా కార్యకర్తలకు నేనే కొండంత అండ.. ‘జగనన్న 2.0 సూపర్ యాప్’ లాంచ్ చేసిన జగన్
పట్టుబడిన నిందితులను వెంటనే మంగళ్‌హాట్ (MLC Son Arrest)పోలీస్ స్టేషన్‌కు తరలించి, డ్రగ్స్ సేవించారో లేదో నిర్ధారించడానికి బ్లడ్ శాంపిల్స్‌ను సేకరించారు. అనంతరం తదుపరి వైద్య పరీక్షల నిమిత్తం వారిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రాంతంలో మాదకద్రవ్యాల కదలికలపై పోలీసులు నిరంతరం డేగకన్ను పెడుతుండటంతోనే ఈ ముఠా దొరికిపోయింది. అయితే, కేసు దర్యాప్తు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నందున, పట్టుబడిన ప్రధాన నిందితుల పూర్తి వివరాలను పోలీసులు ఇప్పటివరకు అధికారికంగా వెల్లడించలేదు.
