NMMS Scholarship: విద్యార్థులకు గోల్డెన్ ఛాన్స్.. రూ. 48,000 స్కాలర్షిప్.. ఇవాళే లాస్ట్ డేట్
పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ‘నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్’ (NMMS Scholarship) పథకాన్ని తీసుకొచ్చింది.
National means cum merit scholarship telangana 2026 application deadline
- ప్రతిభ గల పేద విద్యార్థులకు స్కాలర్షిప్
- ప్రభుత్వ బడుల్లో చదివేవారికే అవకాశం
- ఈ రోజే దరఖాస్తుకు చివరి తేది
NMMS Scholarship: ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు ఆర్థిక భారం లేకుండా ఉన్నత చదువులను అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ‘నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్’ (NMMS Scholarship) పథకాన్ని తీసుకొచ్చింది. తెలంగాణలోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో 8వ తరగతి అభ్యసిస్తున్న విద్యార్థులకు 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఈ స్కాలర్షిప్ పొందే అవకాశాన్ని కల్పిస్తున్నారు. అయితే ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు ఆగస్టు 24వ తేదీయే ఆఖరి గడువుగా అధికారులు నిర్ణయించారు.
Bank Holidays: బ్యాంకింగ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. ఈవారంలో 4 రోజులు బ్యాంకులు బంద్
నాలుగేళ్లలో రూ. 48,000 సాయం:
ఈ పథకానికి ఎంపికైన విద్యార్థులకు 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ పూర్తయ్యే వరకు వరుసగా నాలుగేళ్ల పాటు ప్రతి నెలా రూ. 1,000 చొప్పున సంవత్సరానికి రూ. 12,000 ఆర్థిక సాయం అందుతుంది. దరఖాస్తు చేసుకునే విద్యార్థుల కుటుంబ వార్షికాదాయం రూ. 3.50 లక్షలకు మించకూడదు. అలాగే 7వ తరగతిలో జనరల్ అభ్యర్థులకు 55%, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 50% మార్కులు ఉండాలి. ప్రత్యేకంగా నిర్వహించే రాత పరీక్షలోని MAT, SAT విభాగాలలో చూపిన ప్రతిభ ఆధారంగానే లబ్ధిదారులను ఎంపిక చేస్తారు.
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకే అవకాశం:
కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ, సైనిక్ స్కూళ్లు, ప్రైవేట్ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఈ పథకం వర్తించదు. ఎంపికైన అభ్యర్థులు తమ తదుపరి విద్యను కూడా తప్పనిసరిగా ప్రభుత్వ లేదా ఎయిడెడ్ విద్యాసంస్థల్లోనే కొనసాగించాల్సి ఉంటుంది. సమయం తక్కువగా ఉన్నందున అర్హత కలిగిన విద్యార్థులు ఆలస్యం చేయకుండా వెంటనే తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్సైట్ bse.telangana.gov.in ద్వారా తమ దరఖాస్తులను సమర్పించాలని అధికారులు వెల్లడించారు.
