Rahul Gandhi Bike Rally : గిగ్ వర్కర్ల బైక్ ర్యాలీలో పాల్గొన్న రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి.. వీడియో వైరల్
Rahul Gandhi Bike Rally : హైదరాబాద్లో గిగ్ వర్కర్ల హక్కులు, సంక్షేమం కోసం నిర్వహించిన భారీ బైక్ ర్యాలీలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు.
Rahul Gandhi Bike Rally
Rahul Gandhi Bike Rally : హైదరాబాద్ నగరంలో గిగ్ వర్కర్ల భారీ బైక్ ర్యాలీలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. నగరంలోని హైటెక్ సిటీలోని హెచ్ఐసీసీలో తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో కొత్త ప్రపంచ నిర్మాణం పేరిట భారత్ సమ్మిట్ సదస్సు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సమ్మిట్ లో పాల్గొనేందుకు రాహుల్ గాంధీ హైదరాబాద్ వచ్చారు. ఈ క్రమంలో శిల్పారామం నుంచి జయభేరి గ్రౌండ్స్ వరకు నిర్వహించిన గిగ్ వర్కర్ల బైక్ ర్యాలీలో రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డిలు పాల్గొన్నారు. అనంతరం అక్కడ జరిగే సభలో రాహుల్ ప్రసంగించారు. గిగ్ వర్కర్ల సామాజిక భద్రత, సంక్షేమ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ బైక్ ర్యాలీ నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు ఆయా మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
