Telangana Rains: తెలంగాణలో మూడ్రోజుల్లో వర్షాలు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరో మూడ్రోజుల్లో వర్షాలు కురియనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. సోమవారం ఉదయం 8గంటల 30నిమిషాలకు అందిన వివరాల ప్రకారం.. నైరుతి ఋతుపవనముల స్థితి ఆగమనాన్ని ఇలా లెక్కించారు.
- Subhan Ali Shaik
- Published On : June 13, 2022 / 02:08 PM IST
Telangana Rains
Telangana Rains: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరో మూడ్రోజుల్లో వర్షాలు కురియనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. సోమవారం ఉదయం 8గంటల 30నిమిషాలకు అందిన వివరాల ప్రకారం.. నైరుతి ఋతుపవనముల స్థితి ఆగమనాన్ని ఇలా లెక్కించారు.
జూన్ 13న నైరుతి రుతుపవనములు తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లా వరకు విస్తరించాయి. రాగల 48 గంటల్లో తెలంగాణలోని మరికొన్ని భాగాలకు, తర్వాతి 2 రోజుల్లో రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉంది.
సోమవారం క్రింది స్థాయి గాలులు పశ్చిమ దిశ నుండి తెలంగాణ వైపుకి వీస్తున్నాయి.
Read Also: ఏపీ, తెలంగాణకు చల్లటి కబురు..మోస్తరు నుంచి భారీ వర్షాలు
రాగల 3 రోజులకు వాతావరణ సూచన:
రాష్ట్రంలో కొన్నిచోట్ల తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మంగళ, బుధవారాల్లోనూ తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురుస్తాయి. మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు (గాలి వేగం గంటకు 30నుండి 40 కిమీ వేగంతో)తో కూడిన వర్షం, అక్కడక్కడ కొన్ని జిల్లాలలో పడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
