New Pensions in Telangana : వారందరికీ శుభవార్త… రాష్ట్రంలో కొత్తగా 2 లక్షల కొత్త పెన్షన్లు.. ఎప్పటి నుంచంటే..

New Pensions in Telangana : తెలంగాణ సర్కార్ కొత్తగా 2 లక్షల మందికి ఆసరా పెన్షన్లు ఇచ్చేందుకు రెడీ అయిన సంగతి తెలిసిందే. వాటి పంపిణీ ఎప్పటి నుంచంటే..

reports said telangana govt will decide to distribute new 2 lakh aasara pension from 2026 june 2

New Pensions in Telangana : తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో 2 లక్షల కొత్త పెన్షన్లు ఇవ్వడానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. అయితే ఈ కొత్త పెన్షన్ల పంపిణీ ఎప్పటి నుంచి ఉండబోతుంది అనే దానిపై అప్‌డేట్ వచ్చింది.. ఈ సంవత్సరం జూన్ 2న జరగనున్న తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా కొత్త పెన్షన్లు పంపిణీ చేయాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది. అధికారులు ఇప్పటికే రంగంలోకి దిగారని తెలుస్తోంది. మే నెలలో పెన్షన్ లబ్ధిదారులకు మంజూరు పత్రాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. జూన్ 2 నుంచి పెన్షన్ పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది.

రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఆసరా పెన్షన్లకు అర్హులైన కొత్త వారికి అందించాలని నిర్ణయించడంతో.. పలు జిల్లాల్లో డెత్ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. ఈ క్రమంలో దాదాపు 2 లక్షల పెన్షన్ల లబ్ధిదారులకు అవకాశం ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో కొత్త పెన్షన్ (ఆసరా)లకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తారని తెలుస్తోంది. కొత్తగా పెన్షన్లకు అర్హులైన వారిలో గ్రామాలకు చెందిన వారు అయితే.. ఎంపీడీవో కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి. అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో ఉన్న వారు మున్సిపల్ కార్యాలయాలకు తమ దరఖాస్తులను పంపించాలి. వీటిని పూర్తిగా పరిశీలించి.. అర్హులను ఎంపిక చేసి.. ఆ తర్వాత జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జరుపుకునే వేళ ప్రతి మండలం నుండి అర్హులైన వారికి కొత్త పెన్షన్ పంపిణీ చేయాలని అధికారులు భావిస్తున్నారు.

కొత్త పెన్షన్ మంజూరు చేయాలని నిర్ణయించుకోవడంతో.. డీఆర్డీఓ ఆఫీసుల్లో.. అధికారులు క్షేత్రస్థాయిలో వెరిఫికేషన్ ప్రక్రియ ముమ్మరం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం.. దరఖాస్తు చేసుకున్న వారు పెన్షన్‌కు అర్హులేనా.. వీరు ఎక్కడ నివసిస్తున్నారు.. అనే అంశాలను పరిశీలిస్తున్నారు. అధికారులు కూడా క్షేత్రస్థాయిలోకి వెళ్లి ఆయా వివరాలు తెలుసుకుంటున్నారు. మే రెండో వారంలో దీనిపై పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది అంటున్నారు.