SCR Special Trains: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. చర్లపల్లి – శ్రీకాకుళం మధ్య 16 ప్రత్యేక రైళ్లు.. బుకింగ్స్ షురూ?
పండగల సీజన్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే(SCR Special Trains) అధికారులు అత్యంత కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నారు.
scr announces 16 special trains between charlapalli and srikakulam for festival season
SCR Special Trains: రాబోయే దసరా, దీపావళి పండగల సీజన్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే అధికారులు అత్యంత కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. పండగలకు సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించే లక్ష్యంతో హైదరాబాద్‌లోని చర్లపల్లి నుండి శ్రీకాకుళం రోడ్డు స్టేషన్ల మధ్య ఏకంగా 16 ప్రత్యేక రైలు సర్వీసులను నడపనున్నట్లు శనివారం అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రత్యేక రైళ్లు పండగల రద్దీని తగ్గించడంలో ప్రయాణికులకు ఎంతో మేలు చేయనున్నాయి.
అక్టోబరు 6 నుంచి ప్రారంభం..వారానికి రెండు రోజులు రాకపోకలు:
ఈ ప్రత్యేక రైళ్లు(SCR Special Trains) అక్టోబరు 6 నుంచి నవంబరు 25వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ వెల్లడించారు. రైలు సంఖ్య 07037 చర్లపల్లి నుంచి ప్రతి మంగళవారం బయల్దేరనుండగా, తిరుగు ప్రయాణంలో రైలు సంఖ్య 07038 శ్రీకాకుళం రోడ్డు నుంచి ప్రతి బుధవారం బయల్దేరుతుంది. ఈ సర్వీసులు అక్టోబరు 6, 13, 20, 27, నవంబరు 3, 10, 17, 24 తేదీలలో నడవనున్నాయి. అయితే వేళలకు సంబంధించిన వివరాలను అధికారులు త్వరలోనే వెల్లడించనున్నారు.
ప్రధాన స్టేషన్లలో హాల్టింగ్‌లు.. అన్ని రకాల కోచ్‌లు అందుబాటులో:
ఈ ప్రత్యేక రైలు సర్వీసులు రెండు రాష్ట్రాల మధ్య నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు జంక్షన్, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, దువ్వాడ, సింహాచలం, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తాయి. ప్రయాణికుల వెసులుబాటు కోసం ఈ రైళ్లలో ఏసీ టూ టైర్, ఏసీ త్రీ టైర్, స్లీపర్ తరగతులతో పాటు జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లను కూడా అందుబాటులో ఉంచారు.
