TG TET Notification: తెలంగాణ టీచర్లకు గుడ్ న్యూస్.. అక్టోబర్ 1న 2వ టెట్ నోటిఫికేషన్.. ప్రమోషన్లకు గోల్డెన్ ఛాన్స్
'టీజీటెట్ 2026(TG TET Notification)' రెండో విడత నోటిఫికేషన్‌ను అక్టోబర్ 1న విడుదల చేయనున్నట్లు తెలంగాణ విద్యాశాఖ ప్రకటించింది.
Second TGTET notification for Telangana teachers releasing on October 1st
TG TET Notification: తెలంగాణ విద్యాశాఖ పరిధిలో పనిచేస్తున్న ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయుల బోధనా సామర్థ్యాలను పెంపొందించడంతో పాటు వారికి పదోన్నతుల కల్పన దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ఇందులో భాగంగా ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయుల కోసం ప్రత్యేకంగా నిర్వహించే ‘టీజీటెట్ 2026’ రెండో విడత నోటిఫికేషన్‌ను అక్టోబర్ 1న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఏటా రెండుసార్లు ఈ పరీక్షలు నిర్వహించాలనే నిర్ణయంలో భాగంగా ఇప్పటికే మొదటి విడత టెట్‌ను విజయవంతంగా పూర్తి చేసి, తాజాగా నేడు వాటి ఫలితాలను కూడా అధికారికంగా విడుదల చేసింది. మొదటి విడతలో అర్హత సాధించని వారికి, ప్రమోషన్ల కోసం సిద్ధమవుతున్న టీచర్లకు ఈ రెండో విడత నోటిఫికేషన్ ఒక సువర్ణ అవకాశంగా నిలవనుంది.
నవంబర్ 16 నుంచి ఆన్లైన్ పరీక్షలు – కెరీర్ పురోగతికి బాటలు:
ఈ ప్రత్యేక టీజీటీ(TG TET Notification) ఇన్‌సర్వీస్ టీచర్స్ రెండో విడత ఆన్లైన్ పరీక్షలను నవంబర్ 16 నుంచి నవంబర్ 21 వరకు పకడ్బందీ ఏర్పాట్ల మధ్య నిర్వహించేందుకు విద్యాశాఖ సమాయత్తమవుతోంది. అక్టోబర్ 1న నోటిఫికేషన్ వెలువడిన వెంటనే ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుండగా, ఉపాధ్యాయులు అలసత్వం వహించకుండా ఇప్పటినుంచే పరీక్షకు సన్నాహాలు చేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. ఈ టెట్ అర్హత ద్వారా ఉపాధ్యాయులు తమ కెరీర్ పురోగతిని వేగవంతం చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
