Beer Liquor Prices Hike : మందుబాబులకు బిగ్ షాక్.. ఇకపై తాగితేనే కాదు బిల్లు చూసినా కళ్లు తిరగాల్సిందే.. భారీగా పెరగనున్న ధరలు
Beer Liquor Prices Hike : మందు బాబులకు భారీ బ్యాడ్ న్యూస్. ఇకపై చుక్కేయ్యాలంటే.. జేబుకు పెద్ద బొక్క పడాల్సిందే. త్వరలోనే మద్యం ధరలు భారీగా పెరగనున్నాయి.
- Dharani Pilli
- Updated on- April 16, 2026 / 10:34 AM IST
telangana beer and liquor prices hike likely from may
- త్వరలోనే భారీగా పెరగనున్న మధ్యం ధరలు
- లిక్కర్ తో పాటు బీర్ల ధరలు భారీగా పెంపు
- పాత ధరలకు విక్రయాలు నిలిపివేత
Beer Liquor Prices Hike : మందు బాబులకు నిజంగా ఇది చేదు వార్తే. అసలే ఎండలు మండిపోతున్నాయి. చల్లగా ఓ బీరు తాగి చిల్లవుదామని అనుకుంటే జేబుకు చిల్లు పడే పరిస్థితి. కారణం మద్యం, బీర్ల ధరలు భారీగా పెరగబోతున్నాయి. ధరల పెంపుదలపై ఇప్పటికే మద్యం కంపెనీలు ఒత్తిడి చేయడమే కాక.. సరఫరా కూడా నిలిపివేసాయి. దీంతో త్వరలోనే తెలంగాణలో మద్యం ధరలు భారీగా పెరగబోతున్నాయి. అలానే పాత ధరలకు విక్రయాలు నిలిపి వేయడమేకాక.. కొత్త ధరల కోసం ఎదురు చూస్తున్నట్లు సమాచారం.
సాధారణంగా రాష్ట్రంలో ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మద్యం ధరలు సవరిస్తారు. దీనిలో భాగంగా 2025 జనవరిలోనే కొత్త ధరలు అమలు చేయాల్సి ఉంది. అంతకుముందు 2023 మే నెలలో ధరలు పెరిగాయి. నిబంధనల ప్రకారం 2025 మే నాటికి మళ్లీ పెంచాల్సి ఉంది… ఆ గడువు ఎప్పుడో ముగిసిపోయింది. ఇక ఈ ఏడాదిలో యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా నేచురల్ గ్యాస్ సరఫరా వ్యవస్థ దెబ్బతింది. ఫలితంగా మద్యం సీసాల తయారీ ఖర్చులు కూడా భారీగా పెరిగాయి. అలానే వాటి సరఫరా వ్యవస్థలో కూడా అంతరాయాలు ఏర్పడ్డాయి. ముడిసరుకు కొరత ఏర్పడిందని, దీనివల్ల మద్యం తయారీ కష్టమవుతుందని కంపెనీలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాయి. ధరలు పెంచాలని డిమాండ్ చేశాయి. అయితే ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో కొత్తగా రేట్లు పెంచడానికి అవకాశం లేదు. కానీ కంపెనీలు మాత్రం పాత ధరలకే సరఫరా చేయడానికి నిరాకరిస్తున్నాయి. దీనివల్ల రాష్ట్రంలో మద్యం కొరత ఏర్పడే అవకాశం ఉందని ఎక్సైజ్ శాఖ వర్గాలు భావిస్తున్నాయి.
బీర్ల ధరలు పెరిగేందుకు అవకాశం
వేసవి కాలం కావడంతో రాష్ట్రంలో బీర్లకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. ప్రతి ఏటా వేసవిలో బీర్ల అమ్మకాలు పెరుగుతూనే ఉంటాయి. దీన్ని ఆసరాగా చేసుకుని బీర్ల ధరలను కూడా భారీగా పెంచాలని కంపెనీలు భావిస్తున్నాయి. ప్రీమియం రకం బీర్ల ధరలు ఎక్కువగా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది అంటున్నారు. బీర్ల ధరను.. ప్రస్తుతం ఉన్న దాని కంటే కనీసం 10-15 శాతం పెంచాలని కంపెనీలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఎన్నికల కోడ్ కారణంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేకపోతుంది. దీంతో కంపెనీలు బ్లాక్ మార్కెట్ కు తెరలేపుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే మార్కెట్లో చాలా రకాల బ్రాండ్లు దొరకడం లేదు. ఉన్న బ్రాండ్ల ధరలు కూడా విపరీతంగా పెంచి విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది.
