Rajiv Yuva Vikasam 2026 : రాజీవ్ యువ వికాసంపై కీలక అప్డేట్.. త్వరలోనే వారందరికీ రూ.3 లక్షలు

Rajiv Yuva Vikasam 2026 : రాజీవ్ యువ వికాసం పథకం కోసం ఎదురు చూస్తోన్న వారికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇక త్వరలోనే వారందరికీ రూ.3 లక్షలు ఇవ్వనుంది.

telangana budget 2026 government allocate rs 6000 cr for rajiv yuva vikasam scheme

Rajiv Yuva Vikasam 2026 : తెలంగాణలో నిరుద్యోగ యువత స్వయం ఉపాధి పొందేందుకు గాను వారికి ఆర్థిక సాయం అందించేందుకు రేవంత్ సర్కార్ రాజీవ్ యువ వికాసం పథకాన్ని తీసుకువచ్చింది. ఈ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కమ్యూనిటీలకు చెందిన యువతీయువకులు వ్యాపారం ప్రారంభించి స్వయం ఉపాధి పొందేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం వారికి సబ్సిడీ కింద లోన్లు ఇస్తామని ప్రకటించింది. ఇప్పటికే ఈ పథకాన్ని ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ.. అనేక కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఈ పథకం కోసం నిరుద్యోగ యువతీయువకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో రాజీవ్ యువ వికాసం పథకంపై కీలక అప్‌డేట్ వచ్చింది.

నేడు ప్రవేశపెట్టిన తెలంగాణ బడ్జెట్‌లో రేవంత్ సర్కార్ నిరుద్యోగ యువతకు శుభవార్త చెప్పింది. రాజీవ్ యువ వికాసం పథకం అమలు కోసం ఈ బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.6 వేల కోట్లు కేటాయించింది. ఈ క్రమంలో త్వరలోనే ఈ పథకాన్ని ప్రారంభిస్తారని తెలుస్తోంది. ఈ స్కీమ్ ద్వారా యువతకు ఎక్కువగా 3 లక్షల రూపాయల లోన్స్ ఇవ్వాలన్నది తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం.

ఈ పథకం ద్వారా మొత్తం 3 విధాలుగా సబ్సిడీ ఇస్తారు.

  1. మొదటి విభాగంలో భాగంగా రూ. లక్ష లోన్ తీసుకుంటే.. దాని మీద 80 శాతం సబ్సిడీ లభిస్తుంది. అంటే లబ్ధిదారులు రూ.20 వేలు తిరిగి చెల్లిస్తే సరిపోతుంది.
  2. రెండో విభాగంలో లబ్ధిదారులకు రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల వరకు లోన్ ఇస్తారు. దీనిపై 70 శాతం వరకు సబ్సిడీ లభిస్తుంది.
  3. మూడవ విభాగంలో రూ.3 లక్షల వరకు లోన్ తీసుకుంటే 60 శాతం సబ్సిడీ వర్తింపజేస్తారు.
  4. ప్రధానంగా నిరుద్యోగ యువత, పేద కమ్యూనిటీల యువత లక్ష్యంగా ఈ రుణాలు మంజూరు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.