New Aasara Pensions 2026 : కొత్తగా 2 లక్షల మందికి ఫించన్లు.. ఈ పత్రాలన్నీ ఉన్నాయా.. ఎక్కడ దరఖాస్తు చేయాలంటే
New Aasara Pensions 2026 : తెలంగాణలో కొత్తగా 2 లక్షల మందికి ఆసరా పెన్షన్లు ఇచ్చేందుకు రేవంత్ సర్కార్ అంగీకారం తెలిపిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు..
- Dharani Pilli
- Published On : April 3, 2026 / 04:39 PM IST
telangana government will give 2 lakh new aasara pension required documents and application process details
New Aasara Pensions 2026 : తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు త్వరలోనే 2 లక్షల మందికి కొత్తగా పెన్షన్ ఇచ్చేందుకు అంగీకరించింది. ఇందుకోసం తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రూ.233 కోట్లు కేటాయించింది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల (జూన్ 2, 2026) నుంచి కొత్త పెన్షన్లు పంపిణీ చేయాలని నిర్ణయించింది. కొత్త పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది శుభవార్త అని చెప్పవచ్చు. ఇక తాజాగా ప్రభుత్వం కొత్త పెన్షన్లకు సంబంధించి మార్గదర్శకాలు జారీ చేసింది. కొత్త పెన్షన్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 12 లక్షల మంది ఎదురుచూస్తున్నారని సమాచారం. మార్చి నెల నుంచి కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో కొత్తగా పెన్షన్ పొందాలంటే ఏ పత్రాలు కావాలి.. ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి.. అర్హతలు వంటి వివరాలు..
కొత్త పెన్షన్లకు లబ్ధిదారులు:
వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, గీత, చేనేత కార్మికులు, హెచ్‌ఐవీ/బోదకాలు బాధితులు.
అర్హతలు:
- వయస్సు: 57 సంవత్సరాలు పైబడి ఉండాలి.
- దివ్యాంగులు: 40 శాతం పైగా వైకల్యం ఉండాలి.
- వితంతు పెన్షన్: భర్త డెత్ సర్టిఫికెట్ ఉండాలి.
ఎక్కడ అప్లై చేయాలి
గ్రామ సభలు, ప్రజావాణి, ఎంపీడీఓ (MPDO) ఆఫీసు, పట్టణాల్లో మున్సిపల్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం:
వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, ఆపై అర్హులను ఎంపిక చేస్తారు.
కావాల్సిన పత్రాలు:
- ఆధార్ కార్డ్
- రేషన్ కార్డ్
- నివాస ధృవీకరణ పత్రం
- వయస్సు ధృవీకరణ పత్రం (వృద్ధులకు – ఆధార్/ఓటర్ ఐడి)
- బ్యాంక్ పాస్ బుక్
- వితంతు/దివ్యాంగుల/ఒంటరి మహిళల సర్టిఫికేట్లు (అవసరమైన వారికి)
- పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు
కొత్త పెన్షన్లు మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో.. మార్చి నెల నుంచే గ్రామసభలు, ప్రజావాణి వేదికల ద్వారా పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకుంటున్నారు. దాదాపు 12 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని సమాచారం. వీటన్నింటినీ పరిశీలించి.. అర్హులైన 2 లక్షల మందిని ఎంపిక చేయడం అధికారులకు సవాలుగా మారింది. కానీ ఎట్టి పరిస్థితిలోనూ జూన్ 2 నుంచి కొత్తగా 2 లక్షల మందికి పెన్షన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆ దిశగా అధికారులు చర్యలు వేగవంతం చేశారు.
