Private Ventures : సర్కార్ కీలక నిర్ణయం.. ప్రైవేటు వెంచర్లలోనూ పేదలకు సొంతిల్లు.. త్వరలోనే అమలు
Private Ventures :
- Dharani Pilli
- Updated on- May 11, 2026 / 10:56 AM IST
telangana govt affordable housing policy key decision said Allocate 20 percent to poor in Private Ventures
Private Ventures : తెలంగాణలోని రేవంత్ సర్కార్ సామాన్యులకు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో పేద, మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరకే సొంత ఇల్లు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ‘అఫర్డబుల్ హౌసింగ్ పాలసీ’ (Affordable Housing Policy) కి రూపకల్పన చేస్తోంది. ఇప్పటికే హౌసింగ్ అధికారులు దీనికి సంబంధించిన ముసాయిదా (Draft) సిద్ధం చేయగా, త్వరలోనే దీనిని రాష్ట్ర మంత్రివర్గం ముందుకు తీసుకురానున్నారు. తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన ఈ అఫర్డబుల్ హౌసింగ్ పాలసీలోని అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే.. ఇకపై బిల్డర్లు చేపట్టే ప్రతి ప్రైవేట్ రెసిడెన్షియల్ ప్రాజెక్టులో తప్పనిసరిగా 20 శాతం స్థలాన్ని లేదా నిర్మించిన ఇళ్లను ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (EWS) కోసం కేటాయించాల్సి ఉంటుంది. ఇది ఆమోదం పొందితే ఇకపై ప్రైవేటు వెంచర్లలో పేదలకు సొంతిల్లు కట్టుకునే అవకాశం లభించనుంది.
ప్రస్తుతం గ్రీన్ ఏరియా, ఓపెన్ ప్లేస్ కోసం కేటాయిస్తున్న 20 శాతానికి ఇది అదనంగా ఉంటుంది. ఒకవేళ ప్రాజెక్టులో స్థలం కేటాయించలేకపోతే.. బిల్డర్ నిర్ణీత విస్తీర్ణాన్ని బట్టి ఒక చదరపు అడుగుకు రూ. 20-రూ. 70 వరకు రుసుమును ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తంతో ఇళ్లను నిర్మించి పేదలకు కేటాయిస్తారు.
ఢిల్లీ, హర్యానాలో అమలు
ఢిల్లీ, హర్యానాలో ఈ విధానం విజయవంతంగా అమలవుతోంది. ఈ క్రమంలో తెలంగాణలో కూడా దీనిని అమలు చేయాలని భావిస్తోన్న రేవంత్ సర్కార్ ఆదేశాల మేరకు.. ఈ విధానాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు మన రాష్ట్ర హౌసింగ్ బోర్డు ఉన్నతాధికారుల బృందం ఇటీవల ఢిల్లీ, హర్యానా రాష్ట్రాల్లో పర్యటించింది. అక్కడ ఈ 20 శాతం కేటాయింపు నిబంధన ఎలా అమలవుతుందో పూర్తిగా తెలుసుకున్నారు. ప్రైవేటు వెంచర్లలో బిల్డర్లు వదిలిన 20 శాతం స్థలంలో ప్రభుత్వం సింగిల్ లేదా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను నిర్మించి పేదలకు అందిస్తోంది. ఇదే మోడల్‌ను తెలంగాణలో కూడా అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు.
బిల్డర్ల భాగస్వామ్యంతో..
పోయిన సంవత్సరం జరిగిన ‘తెలంగాణ రైజింగ్’ సదస్సులో ఈ పాలసీపై పలువురు బిల్డర్లు తమ సలహాలను ప్రభుత్వానికి తెలిపారు. అయితే ఈ పాలసీని తుదిగా ప్రకటించే ముందు బిల్డర్లతో మరోసారి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి, వారి అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. పెద్ద అపార్ట్‌మెంట్లు లేదా విల్లాల్లో పనిచేసే పనివారు, కార్మికులు సుదూర ప్రాంతాల నుంచి రానవసరం లేకుండా.. వారు పనిచేసే చోట లేదా సమీపంలోనే నివసించేలా చూడటమే ఈ విధానం ప్రధాన ఉద్దేశం. ఉమ్మడి ఏపీలోనూ గచ్చిబౌలిలోని రాంకీ ప్రాజెక్టులో ఇదే తరహాలో 20 శాతం స్థలాన్ని పేదలకు కేటాయించిన దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడు
