Telangana New CM: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే.. తేల్చి చెప్పిన కాంగ్రెస్

ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.

తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి ఎవరంటూ రెండు రోజులుగా సాగుతున్న హైడ్రామాకు కాంగ్రెస్ అధిష్టానం తెరదించింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డే కాబోయే ముఖ్యమంత్రి అని కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్ మంగళవారం ప్రకటించారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.

వాస్తవానికి తెలంగాణలోని కాంగ్రెస్ సీనియర్ నేతల మధ్య ముఖ్యమంత్రి పదవి కోసం చాలా పెద్ద పోటీయే నడిచింది. భట్టివిక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి నేతలు చర్చలో ప్రధానంగా వినిపించారు. అయితే కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం రేవంత్ రెడ్డివైపే మొగ్గు చూపింది.

ఈ నెల 7న తెలంగాణ మూడవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ఇద్దరు ఉప ముఖ్యమంత్రులపై మాత్రం కాంగ్రెస్ క్లారిటీ ఇవ్వలేదు. ఇక మంత్రుల గురించి ఎలాంటి విషయం వెల్లడించలేదు. ముఖ్యమంత్రిపై కొనసాగుతున్న ఉత్కంఠకు మాత్రమే తెరదించారు. ఇక ఉప ముఖ్యమంత్రి సహా మంత్రి పదవుల వేటలో కాంగ్రెస్ నేతలు ఉన్నట్లు తెలుస్తోంది.

 

ట్రెండింగ్ వార్తలు