TG 10th Result 2026 : తెలంగాణలో టెన్త్ ఫలితాలు వచ్చేశాయ్.. ఇక్కడ చెక్ చేసుకోండి.. పాస్ పర్సంటేజ్ ఎంతంటే? ఫుల్ డీటెయిల్స్.. వాట్సాప్‌లో ఇలా చెక్ చేసుకోండి..
TG 10th Result 2026 : తెలంగాణలో టెన్త్ ఫలితాలు విడుదలయ్యాయి. ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ లు కలిసి ఫలితాలను విడుదల చేశారు.
TG 10th Result 2026
TG 10th Result 2026 : తెలంగాణలో టెన్త్ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) ప్రాంగణంలోని గోదావరి ఆడిటోరియంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ లు కలిసి ఫలితాలను విడుదల చేశారు.
♦ 95.15 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.
♦ బాలురు 94.07 శాతం, బాలికలు 96.26శాతం ఉత్తీర్ణత సాధించారు.
♦ ఈ సంవత్సరం మొత్తం 5731 పాఠశాలల్లో 100శాతం ఉత్తీర్ణత సాధించగా ఆరు పాఠశాలల్లో 0శాతం ఉత్తీర్ణత నమోదైంది.
♦ ములుగు జిల్లా 99.30శాతం ఉత్తీర్ణతతో ప్రథమ స్థానంలో నిలవగా.. హైదరాబాద్ జిల్లా పరిధిలో 89.23శాతం ఉత్తీర్ణత సాధించారు.
♦ మొదటి మూడు స్థానాల్లో ములుగు, నాగర్ కర్నూల్, నిర్మల్ జిల్లాలు నిలిచాయి.
♦ లాస్ట్ మూడు స్థానాల్లో హైదరాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, వికారాబాద్ జిల్లాలు నిలిచాయి.
ఫలితాలను results.bsetelangana.org తోపాటు https://10tv.in లోనూ చెక్ చేసుకోవచ్చు. ఫలితాలు తెలుసుకోవాలనుకునే విద్యార్థులు అధికారిక వెబ్ సైట్ నుంచి మాత్రమే కాక.. వాట్సాప్ ద్వారా కూడా ఫలితాలను తెలుసుకోవచ్చు. ఇందుకోసం విద్యార్థులు 80969 58096 నంబర్‌కి వాట్సాప్‌లో ‘Hi’ అని మెసేజ్ చేసి, ‘SSC రిజల్ట్స్’ అని టైప్ చేసి, ఆ తర్వాత హాల్‌టికెట్ నంబర్ ఇస్తే ఫలితాల వివరాలు వస్తాయని అధికారులు తెలిపారు.
