Telangana Rains: తెలంగాణకు భారీ వర్ష సూచన.. రాబోయే రెండు రోజులు అలర్ట్
తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది(Telangana Rains).
telangana weather forecast heavy rain alert yellow warning issued
Telangana Rains: తెలంగాణ వ్యాప్తంగా రాబోయే రెండు రోజుల పాటు వాతావరణం ఒక్కసారిగా మారనుంది. మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో అక్కడక్కడ గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ‘ఎల్లో అలర్ట్’ జారీ చేసింది.
Driving license: డ్రైవింగ్ లైసెన్స్ వ్యాలిడిటీలో కీలకు మార్పులు?.. ఇక ఆ సమస్య తప్పినట్టే
మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ జిల్లాలతో పాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో మోస్తరు వర్షాలు (Telangana Rains)కురిసే అవకాశం ఉంది. కామారెడ్డి జిల్లాలో తేలికపాటి నుండి మోస్తరు జల్లులు పడతాయని అంచనా వేస్తున్నారు. అలాగే బుధవారం నాడు వికారాబాద్, మహబూబ్నగర్, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వానల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేస్తూ, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
