Hyderabad : హైదరాబాద్ ప్రజలకు అలర్ట్.. ఆ రూట్లలో వెళ్లకండి.. ట్రాఫిక్ ఆంక్షలు.. ఎప్పటివరకు అంటే? ఫుల్ డీటెయిల్స్ ఇవే..
Hyderabad : హైదరాబాద్ నగర ప్రజలకు బిగ్ అలర్ట్. నగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
Hyderabad
- ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లు
- ఉప్పల్ ప్రాంతంలో వాహనాల దారి మళ్లింపు
- వాహనదారులకు పోలీసులు కీలక సూచనలు
Hyderabad : హైదరాబాద్ నగర ప్రజలకు బిగ్ అలర్ట్. నగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఐపీఎల్ -2026 సీజన్లో భాగంగా ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ మ్యాచ్‌ల నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
Also Read : IPL 2026 : మా ఓటమికి ప్రధాన కారణాలివే.. హార్దిక్ పాండ్యా కీలక కామెంట్స్.. రోహిత్ శర్మకు గాయంపై..
ఏప్రిల్ 13, 18, 21తోపాటు మే నెలలో 3, 6, 22 తేదీల్లో ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ లు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. 13వ తేదీన సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. దీంతో మధ్యాహ్నం 12గంటల నుంచి అర్ధరాత్రి వరకు నాగోల్ – హబసిగూడ, బోడుప్పల్ – అంబర్‌పేట మార్గాల్లో ట్రాఫిక్ రద్దీగా ఉండే అవకాశం ఉంది. దీంతో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలని మల్కాజిగిరి ట్రాఫిక్ పోలీసులు సూచించారు. స్టేడియం సమీపంలో నాలుగు పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేయగా.. మ్యాచ్ చూసేందుకు పాస్ ఉన్నవారి వాహనాలకు మాత్రమే స్టేడియం లోపల పార్కింగ్ కు అనుమతి ఉంటుందని పోలీసులు తెలిపారు.
ట్రాఫిక్ మళ్లింపు ఇలా..
♦ ఘట్కేసర్ వైపు నుంచి వచ్చే వాహనాలను మెహఫిల్ హోటల్ హెచ్ఎండీఏ భగాయత్ వద్ద నాగోల్ – ఎల్బీనగర్ వైపు మళ్లిస్తారు.
♦ ఎల్బీనగర్ నుంచి ఉప్పల్ వచ్చే వాహనాలను నాగోల్ మెట్రో వద్ద యూటర్న్ ఇచ్చి బోడుప్పల్ – చెంగిచర్ల మార్గంలో దారి మళ్లిస్తారు.
♦ తార్నాక వైపు నుంచి వచ్చే వాహనాలను హబ్సిగూడ ఎక్స్ రోడ్డు వద్ద నాగాచారం – ఎన్ఎఫ్సీ – చర్లపల్లి మార్గంలో మళ్లిస్తారు.
♦ రామంతాపూర్ నుంచి వచ్చే వాహనాలను స్ట్రీట్ నం. 8 వద్ద హబ్సిగూడ – నాచారం మార్గంలోకి డ్రైవర్ట్ చేస్తారు.
