Kavitha: ఎల్నినో ముప్పుపై నిర్లక్ష్యం.. పంటలు వేయొద్దంటారా? ఇది సీఎం బాధ్యతారాహిత్యం కాదా.. రేవంత్ పై కవిత ఫైర్
ఎల్నినో ముప్పుపై నిర్లక్ష్యం వహించిన కాంగ్రెస్ ప్రభుత్వం పాత ప్రభుత్వాన్ని తిడుతూ కాలక్షేపం చేస్తోందని కవిత (Kavitha)విమర్శించారు.
Trs kavitha slams revanth reddy government over farmers and water issues
Kavitha: ఎల్నినో ముప్పుపై పది నెలల ముందు నుంచే స్పష్టమైన హెచ్చరికలు ఉన్నప్పటికీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహించిందని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కవిత(Kavitha) విమర్శించారు. ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్లే నేడు తీవ్ర నీటి ఎద్దడి తలెత్తిందని, ఇప్పుడేమో ఏకంగా పంటలు వేయొద్దంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రైతులకు సలహాలు ఇవ్వడం బాధ్యతారాహిత్యమని ఆక్షేపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 30 నెలలు గడుస్తున్నా, ఇంకా పాత ప్రభుత్వాన్నే తిడుతూ కాలాన్ని వృధా చేస్తున్నారని మండిపడ్డారు.
సొంత జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదు:
సీఎం రేవంత్రెడ్డి తన సొంత జిల్లా అయిన ఉమ్మడి మహబూబ్నగర్లో పెండింగ్ ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయడం లేదని కవిత ప్రశ్నించారు. మిషన్ భగీరథ పథకాన్ని పూర్తి స్థాయిలో నిర్వహించి ప్రతి ఇంటికీ తాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. మేడిగడ్డ ప్రాజెక్టుకు వెంటనే మరమ్మతులు చేపట్టి నీటిని నిల్వ చేస్తారా లేదా ఇప్పటికీ గత ప్రభుత్వాన్ని నిందిస్తూ కాలక్షేపం చేస్తారా అని నిలదీశారు.
సొంత తోబుట్టువులను తిట్టిస్తున్న కేటీఆర్.. కవిత ఘాటు వ్యాఖ్యలు:
తోడబుట్టిన వారిని కూడా కిరాయి మనుషులతో తిట్టించే నీచమైన సంస్కృతి కేటీఆర్దని కవిత తీవ్రంగా మండిపడ్డారు. ఎర్రవల్లి ఫామ్హౌస్కు భారీ మోటార్లతో నీటిని తరలిస్తున్నారో లేదో తెలియదు కానీ, చాలా మంది అధికార పక్ష ఎమ్మెల్యేల పొలాలకు అక్రమంగా మోటార్లు అమర్చుకున్నట్లు తమకు సమాచారం ఉందని వ్యాఖ్యానించారు.
