TS Inter Results 2026 : నేడే ఇంటర్ ఫలితాలు.. వాట్సాప్‌లో ఇలా చెక్ చేసుకోండి.. స్టెప్ బై స్టెప్ ఫుల్ డీటెయిల్స్..
TS Inter Results 2026 : ఉదయం 11గంటలకు ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ (జనరల్ అండ్ వొకేషనల్) ఫలితాలు వెల్లడించనున్నారు. ఈసారి ఫలితాలను వాట్సాప్‌లోనూ చెక్ చేసుకోవచ్చు..
TS inter results 2026
- ఇవాళ ఇంటర్ ఫలితాలు వెల్లడి
- ఉదయం 11గంటలకు విడుదల
- వాట్సాప్‌లోనూ మీ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు
TS Inter Results 2026 : తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్. ఇవాళ ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డు ప్రకటన చేసింది. ఉదయం 11గంటలకు ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ (జనరల్ అండ్ వొకేషనల్) ఫలితాలు వెల్లడిస్తామని తెలిపింది. ప్రభుత్వ సలహాదారు కేశవ రావు, సెక్రటరీ యోగితా రాణా చేతుల మీదుగా ఫలితాల విడుదల ఉంటుంది. హైదరాబాద్‌లోని బోర్డు కార్యాలయంలో ఫలితాలను రిలీజ్ చేయనున్నారు.
ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదల చేసిన వెంటనే ఆన్లైన్లో అందుబాటులో ఉంచనున్నారు. అధికారిక వెబ్సైట్లు tgbie.cgg.gov.in, results.cgg.gov.in లలో విద్యార్థులు తమ రిజల్ట్స్ చూసుకోవచ్చు. ఈ ఏడాది మొత్తం 9,70,075 మంది స్టూడెంట్స్ ఇంటర్ పరీక్షలకు హాజరయ్యారు. మొదటి సంవత్సరంలో 4,89,126 మంది విద్యార్థులు.. రెండో సంవత్సరంలో 5,07,949 విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇదిలాఉంటే.. ఈసారి ఇంటర్ ఫలితాలను వాట్సాప్ లోనూ చూసుకోవచ్చు. దీనికి సంబంధించిన సేవలను సచివాలయంలో ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు శనివారం ఆవిష్కరించారు.
వాట్సాప్‌లో ఇలా చెక్ చేసుకోండి..
♦ ఇంటర్ ఫలితాలను వాట్సాప్‌లో ఏర్పాటు చేసిన మీసేవ చాట్‌బాట్ ద్వారా మన మొబైల్ ఫోన్లోనే తెలుసుకోవచ్చు.
♦ ఫలితాలు వెలువడిన వెంటనే వాట్సాప్‌లో చూసుకోవచ్చు.
♦ ఫలితాల కోసం విద్యార్థులు 80969 58096 నంబరును ‘మీ సేవ తెలంగాణ’ పేరుతో సేవ్ చేసుకోవాలి.
♦ ఆ నంబరుకు వాట్సాప్ నుంచి హాయ్ అని మెసేజ్ పంపాలి.
♦ ఆ తర్వాత స్క్రీన్‌పై ఇంటర్ ఫలితాల లింక్ ఎంపిక చేసుకోవాలి.
♦ హాల్ టికెట్ నెంబర్, పుట్టినరోజు వివరాలను నమోదు చేస్తే క్షణాల్లో మీసేవ చాట్బాట్లో ఫలితాలను అందిస్తుంది.
