VC Sajjanar : నడిరోడ్డుపై ట్రాఫిక్ సిగ్నల్ వద్ద యువతి డ్యాన్స్ .. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సీరియస్

ట్రాఫిక్ సిగ్నల్ వద్ద యువతి డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను తన అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేసిన టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్..

VC Sajjanar : నడిరోడ్డుపై ట్రాఫిక్ సిగ్నల్ వద్ద యువతి డ్యాన్స్ .. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సీరియస్

VC Sajjanar

Girl Dances Traffic Signal : ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద రెడ్ లైట్లు పడ్డాయి. వాహనాలు ఆగిపోతున్నాయి.. అదే సమయంలో బ్యాగ్ వేసుకుని రోడ్డు మధ్యలోకి వచ్చింది ఓ యువతి విచిత్రంగా ప్రవర్తించింది. బ్యాగ్ ను పక్కకు విసిరేసి రోడ్డుపై పడుకుని డ్యాన్స్ చేయడం మొదలుపెట్టింది.. యువతి విచిత్రమైన ప్రవర్తనతో వాహనదారులు ఖంగుతిన్నారు. యువతి డ్యాన్స్ చేస్తున్న సమయంలో పక్కనే ఉన్న ఆమె స్నేహితులు వీడియో తీశారు. అయితే, ఆ యువతి యూట్యూబ్ షార్ట్స్ కోసం ఇలా నడిరోడ్డుపై డ్యాన్స్ చేసినట్లు తెలుసుకున్న వాహనదారులు ఆమెపై మండిపడ్డారు.

Also Read : Ponguleti: 6 గ్యారంటీలకు ఇలా దరఖాస్తు చేసుకోండి.. తెల్లరేషన్ కార్డు ఉండాలి: మంత్రి పొంగులేటి

ట్రాఫిక్ సిగ్నల్ వద్ద యువతి డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను తన అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేసిన టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్.. యువతి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. యువతలో ఈ పెడధోరణులు విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. నేటి యువతకు ఇన్ స్టా రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ పిచ్చి పట్టుకోవడం బాధాకరమని అన్నారు. సమాజానికి పనికి వచ్చే పనులు చేసి నలుగురికి ఆదర్శంగా నిలవాల్సిన యువతరం.. సోషల్ మీడియా మత్తులో పడి జీవితాలను నాశనం చేసుకుంటోందని అన్నారు. సోషల్ మీడియాలో రాత్రికి రాత్రే పాపులర్ కావడం కోసం నడిరోడ్డుపై ఇలాంటి వెర్రి చేష్టలు చేస్తూ ఇతరులకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగించడం ఏం ఆనందంమో.. ఏమో అంటూ సజ్జనార్ అన్నారు.