Telangana Govt : TGPSC నుంచి మరో నోటిఫికేషన్ విడుదల.. 24 పోస్టులు.. లక్షకుపైగా జీతం.. అర్హతలు ఇవే..
Telangana Govt : తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలకోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. టీజీపీఎస్సీ నుంచి తాజాగా మరో నోటిఫికేషన్ విడుదలైంది.
TGPSC Jobs Notification 2026
- నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన తెలంగాణ సర్కార్
- 24 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన టీజీపీఎస్సీ
- నెల వేతనం రూ.లక్షకుపైనే
Telangana Govt : తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలకోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టింది. ఇప్పటికే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) పలు శాఖల్లో 290 పోస్టుల భర్తీకోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. తాజాగా.. డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ (DyEO) & గెజిటెడ్ హెడ్ మాస్టర్ గ్రేడ్-I పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
Also Read : Lingamaneni Ramesh : జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ పేరు ఖరారు
మొత్తం 24 అత్యున్నత గెజిటెడ్ కేడర్ పోస్టులను జనరల్ రిక్రూట్మెంట్ పద్దతిలో భర్తీ చేయనున్నట్లు టీజీపీఎస్సీ తెలిపింది. విద్యాశాఖలో అత్యంత కీలకమైన ఈ ఉధ్యోగాల భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ మేరకు టీజీపీఎస్సీ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేయగా.. అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. జూన్ 12 నుండి జులై 19 వరకు ధరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది.
ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకొనేవారి అభ్యర్థుల వయస్సు జులై 1, 2026 నాటికి కనీసం 18ఏళ్లు నిండి ఉండాలని, గరిష్ఠంగా 44ఏళ్లు లోపు ఉండాలని సూచించింది. డిగ్రీ లేదా పీజీలో 55శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలని, ఎంపిక విధానం రాత పరీక్ష సీబీఆర్టీ/ఓఎంఆర్ పద్దతిలో ఉంటుందని తెలిపింది. జూలై 19వ తేదీన పరీక్ష ఉంటుందని, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయటం జరుగుతుందని టీజీపీఎస్సీ పేర్కొంది.
విద్యాశాఖలో ఉన్నత స్థాయి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకునే వారికి ఇది అద్భుత అవకాశమని, పూర్తి అర్హతలు, సిలబస్, ఫీజు వివరాలు, దరఖాస్తు ప్రక్రియ కోసం www.websitenew.tgpsc.gov.in ను సందర్శించాలని అధికారులు ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఉద్యోగాలకు అర్హత సాధించిన వారికి ప్రతి నెల వేతనం రూ.58,850 నుంచి రూ.1,37,050 వరకు ఉంటుందని టీజీపీఎస్సీ పేర్కొంది.
