TGSRTC : ఆర్టీసీ ప్రయాణికులకు శభవార్త.. టికెట్ ఇలా బుక్ చేసుకుంటే 10శాతం రాయితీ
TGSRTC : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులకు శుభవార్త చెప్పింది.
TGSRTC Return Journey 10Percent Discount
TGSRTC : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. టికెట్లపై రాయితీ ప్రకటించింది. ప్రయాణికులు తాము వెళ్లాలనుకున్న గమ్యస్థానం, తిరుగు ప్రయాణం టికెట్లు ఒకేసారి బుక్ చేసుకుంటే రిటర్న్ జర్నీ టికెట్ ధరలో 10శాతం రాయితీ కల్పిస్తామని తెలిపింది.
Also Read : Hyderabad Road Accident : మాదాపూర్‌లో కారు ఢీ, యువతి మృతి.. ఎంపీ లింగమనేని కుమారుడిపై కేసు నమోదు!
ప్రయాణికులను ఆకట్టుకోవడానికి కొద్దికాలంగా టీజీఎస్ఆర్టీసీ కొత్త స్కీంలను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఈ క్రమంలో తాజాగా.. మరో కీలక విషయాన్ని ఆర్టీసీ వెల్లడించింది. ప్రయాణికులు ఒక ప్రాంతానికి వెళ్లేటప్పుడే తమ తిరుగు ప్రయాణ టికెట్‌ను కూడా ముందస్తుగా బుక్ చేసుకుంటే మొత్తం ధరపై 10 శాతం రాయితీని ప్రకటించింది. ఒక బుకింగ్, రెండు ప్రయాణాలు, ఎక్కువ మిగులు నినాదంతో ఆర్టీసీ ఈ విధానం అందుబాటులోకి తెచ్చింది. కాగా అన్ని బస్సుల్లో ఈ రాయితీ సౌకర్యం అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు.
ఇప్పటికే ఆర్టీసీ యాజమాన్యం మహాలక్ష్మీ ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఉచిత బస్సు ప్రయాణం ద్వారా మహిళలు ఇక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. పురుషులు, రిజర్వేషన్ చేసుకునే ఇతర ప్రయాణికులను ఆర్షించేందుకు ఆర్టీసీ యాజమాన్యం టికెట్ పై 10శాతం రాయితీని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ సౌకర్యం ద్వారా ముఖ్యంగా సుదూర ప్రాంతాలకు ప్రయాణించే మధ్య తరగతి ప్రజలకు, పండుగ సమయాల్లో ఇళ్లకు వెళ్లేవారికి గొప్ప వెసులుబాటుగా మారుతుంది.
🚌 Round trip, double the convenience, more savings! 💙💚
Book your journey with TGSRTC and enjoy 10% OFF on your return journey.
Travel comfortably. Travel safely. Save more on the way back! ✨#TGSRTC #RoundTrip #ReturnJourney #10PercentDiscount #TravelSmart #SaveOnTravel pic.twitter.com/G5uCsyvdZM— TGSRTC (@TGSRTCHQ) August 20, 2026
