Telangana New Airport: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. వరంగల్ ఎయిర్ పోర్టుపై కీలక అప్డేట్.. భూసేకరణ పూర్తి..
Telangana New Airport: తెలంగాణలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం (Warangal Airport) తర్వాత మరొక ఎయిర్పోర్ట్ అందుబాటులోకి రాబోతోంది
Warangal mamnoor airport tender schedule announced
Telangana New Airport: తెలంగాణలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం తర్వాత మరొక ఎయిర్పోర్ట్ అందుబాటులోకి రాబోతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మామునూరు ఎయిర్పోర్ట్ అభివృద్ధికి సంబంధించి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) రూ.213.59 కోట్లతో కీలకమైన టెండర్ షెడ్యూల్ను తాజాగా విడుదల చేసింది. డొమెస్టిక్ టెర్మినల్, ఏటీసీ (ATC) టవర్, ఫైర్ స్టేషన్ నిర్మాణాల కోసం బిడ్లను ఆహ్వానించారు. ఈ పనులన్నింటినీ 18 నెలల వ్యవధిలోనే పూర్తి చేయాలని అధికారులకు నిబంధన విధించారు.
Also Read – Khyber Pakhtunkhwa Attack: పాకిస్తాన్లో ఘోర ఆత్మాహుతి దాడి.. 15 మంది దుర్మరణం!
కాకతీయ శైలి డిజైన్.. ప్రధాని మోదీతో శంకుస్థాపనకు ప్లాన్:
తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా ఈ విమానాశ్రయాన్ని ‘కాకతీయ శైలి’ డిజైన్లతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ ప్రక్రియను (Telangana New Airport) పూర్తి చేయడంతో పనులు వేగవంతమయ్యాయి. నవంబర్ నాటికి టెండర్ ప్రక్రియ ముగియనుండగా, ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద సమీక్షలో అధికారులను ఆదేశించారు.
విస్తరిస్తున్న విమానయాన రంగం.. పెరగనున్న ఉపాధి అవకాశాలు:
మామునూరుతో పాటు ఆదిలాబాద్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతాల్లో కూడా కొత్త ఎయిర్పోర్టుల ఏర్పాటుకు సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటికే ఆదిలాబాద్లో భూసేకరణ కోసం నోటిఫికేషన్ కూడా జారీ అయింది. ఈ నూతన ఎయిర్పోర్టులు అందుబాటులోకి వస్తే ఉత్తర తెలంగాణ రూపురేఖలు మారడమే కాకుండా, కొత్త పరిశ్రమలు, లాజిస్టిక్స్ రంగం అభివృద్ధి చెంది యువతకు భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
