Weather Alert to Telangana: వెదర్ అలర్ట్.. రానున్న 3 రోజులపాటు తెలంగాణలో…!
రాబోయే 3 రోజులకు.. తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం, అల్పపీడన ప్రభావం, నైరుతి రుతుపవనాల తిరోగమనంపై.. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అప్ డేట్ ఇచ్చింది.
- Ravikanth 10tv
- Published On : October 18, 2021 / 01:34 PM IST
Rains
తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. రాబోయే 3 రోజుల పాటు ఎలాంటి హెచ్చరికలు లేవని తెలిపింది. తెలంగాణ పరిసర ప్రాంతాల్లో ఆదివారం కేంద్రీకృతమైన అల్పపీడనం.. నేడు రాష్ట్రం నుంచి దూరంగా వెళ్లిపోయినట్టు ప్రకటించింది. ఇదే సమయంలో.. ఆదివారం కాస్త ప్రభావితం చూపిన తూర్పు – పశ్చిమ ఉపరితల ద్రోణి ఇవాళ బలహీనపడినట్టు వెల్లడించింది.
నైరుతి రుతుపవనాలు వెనక్కు వెళ్లే ప్రక్రియ నల్గొండ వరకూ కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ పశ్చిమ దిశ నుంచి తెలంగాణ వైపు గాలులు వీస్తున్నాయని.. వచ్చే 48 గంటల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది.
ఇటీవల కురిసిన వర్షాలకు.. హైదరాబాద్ నగరం దాదాపుగా నీట మునిగింది. ప్రధాన రహదారులు కూడా వరదతో నిండిపోయాయి. ఆ ప్రభావం నుంచి బయటపడేందుకు సిటీ జనాలు చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఇప్పుడు.. రానున్న 3 రోజులు వర్షాలు లేవన్న హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటనతో.. నగర ప్రజలు రిలాక్స్ అవుతున్నారు.
Read More:
Heavy Rains in Kerala: కేరళను ముంచెత్తిన భారీ వర్షాలు!
Heavy rains in Kerala: భారీ వర్షాలకు.. కేరళ విలవిల.. వరదల్లో కొట్టుకుపోతున్న ఇళ్లు, చెట్లు..!
