Amazon Now : స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, జెప్టో, బ్లింకిట్ లకు గట్టి పోటీ.. రంగంలోకి దిగుతున్న అమెజాన్.. హైదరాబాద్ సహా ఒకేసారి 100 నగరాల్లో
Amazon Now : అమెజాన్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 100 నగరాల్లో
- Dharani Pilli
- Updated on- April 27, 2026 / 06:23 PM IST
amazon to expand quick commerce service amazon now in 100 cities including hyderabad visakhapatnam
Amazon Now : నేటి కాలంలో కూరగాయలు మొదలు కిరాణా సరుకులు వరకు ఏవి కావాలన్నా సరే ఆన్‌లైన్‌లోనే బుక్ చేసుకుంటున్నారు. స్విగ్గీ, బిగ్ బాస్కెట్, రిలయన్స్ వంటి కంపెనీలు కేవలం 15-20 నిమిషాల్లోనే వీటిని డెలివరీ చేస్తున్నాయి. దీని వల్ల బయటకు వెళ్లాల్సిన పని లేదు.. సమయం కూడా ఆదా అవుతుంది. నగరాల్లో అయితే చాలా మంది ఈ యాప్‌లను వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో వీటికి పోటీ ఇచ్చేందుకు దిగ్గజ ఈ-కామర్స్ సంస్థ రంగంలోకి దిగనుంది. అమెజాన్ ఇండియా తన క్విక్ కామర్స్ సర్వీస్ ‘అమెజాన్ నౌ’ (Amazon Now) ను 100 నగరాలకు విస్తరిస్తున్నట్లు ఏప్రిల్ 27న ప్రకటించింది.
వేగంగా అభివృద్ధి చెందుతున్న రాపిడ్-డెలివరీ మార్కెట్‌లో తన హవా పెంచుకోవడం కోసం… అమెజాన్ ఈ నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా, 1,000 కంటే ఎక్కువ మైక్రో-ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్లను (నిర్వహణ కేంద్రాలను) ఏర్పాటు చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ క్రమంలో అమెజాన్ భారతదేశంలో కార్యకలాపాలను మరింత బలోపేతం చేసేందుకు రూ. 2,800 కోట్ల పెట్టుబడి పెడుతున్నట్లు కొన్ని రోజుల క్రితమే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ లోపే ఈ నిర్ణయం వెలువడటం గమనార్హం. ఈ పెట్టుబడిలో కొంత భాగాన్ని క్విక్ కామర్స్ మౌలిక సదుపాయాల కోసం వినియోగిస్తున్నారు.
ఈ క్రమంలో అమెజాన్ ఇండియా ‘ఎవ్రీడే ఎసెన్షియల్స్’ వైస్ ప్రెసిడెంట్ హర్ష్ గోయల్ మాట్లాడుతూ.. “వినియోగదారులు ‘అమెజాన్ నౌ’ సేవలను, ముఖ్యంగా డెలివరీ వేగం, నాణ్యత, నేరుగా రైతుల నుండి సేకరించిన తాజా కూరగాయలను మెచ్చుకుంటున్నారు. ఈ విజయంతో మేము మా విస్తరణ ప్రణాళికలను వేగవంతం చేశాము. 1,000 కంటే ఎక్కువ మైక్రో-ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్ల ద్వారా 100 నగరాలకు అమెజాన్ నౌ సేవలను విస్తరిస్తాము” అని తెలిపారు.
ప్రస్తుతం బెంగళూరు, ఢిల్లీ-ఎన్‌సీఆర్, ముంబైలలో అందుబాటులో ఉన్న అమెజాన్ నౌ.. త్వరలో హైదరాబాద్, పూణే, చెన్నై, కోల్‌కతా, జైపూర్, లక్నో, చండీగఢ్, అహ్మదాబాద్, కొచ్చి, అమృత్‌సర్, మంగళూరు, వైజాగ్ వంటి నగరాల్లో కూడా అందుబాటులోకి రానుంది. నెట్‌వర్క్ విస్తరణ ద్వారా అమెజాన్.. 16,000కి పైగా రైతులను వినియోగదారులతో నేరుగా కలపనుంది. తాజా పండ్లు, కూరగాయల సరఫరా వ్యవస్థను బలపరచనుంది.
క్విక్ కామర్స్ మార్కెట్లోకి ప్రవేశించేందుకు అమెజాన్ 2025లో ‘అమెజాన్ నౌ’ను ప్రారంభించింది. గడిచిన ఏడాది కాలంగా ఈ సేవలను క్రమంగా విస్తరిస్తూ వస్తోంది. ఆరంభంలో అమెజాన్ నౌ ఆర్డర్లు నెలకు 25 శాతం వృద్ధిని నమోదు చేశాయని, ఈ సేవలను ఉపయోగించిన తర్వాత ప్రైమ్ సభ్యులు షాపింగ్ చేసే ఫ్రీక్వెన్సీ మూడు రెట్లు పెరిగిందని కంపెనీ తెలిపింది. అమెజాన్ గతంలో 300 మైక్రో-ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్లను కలిగి ఉంది. తాజా ప్రక్రియతో వీటి సంఖ్యను మూడు రెట్లు పెంచి, ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న బ్లింకిట్ (Blinkit), జెప్టో (Zepto) మరియు స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ (Swiggy Instamart) వంటి సంస్థలకు గట్టి పోటీ ఇవ్వాలని అమెజాన్ భావిస్తోంది.
అమెజాన్ నౌ’ను ప్రారంభించింది. గడిచిన ఏడాది కాలంగా ఈ సేవలను క్రమంగా విస్తరిస్తూ వస్తోంది. ఆరంభంలో అమెజాన్ నౌ ఆర్డర్లు నెలకు 25 శాతం వృద్ధిని నమోదు చేశాయని, ఈ సేవలను ఉపయోగించిన తర్వాత ప్రైమ్ సభ్యులు షాపింగ్ చేసే ఫ్రీక్వెన్సీ మూడు రెట్లు పెరిగిందని కంపెనీ తెలిపింది. అమెజాన్ గతంలో 300 మైక్రో-ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్లను కలిగి ఉంది. తాజా ప్రక్రియతో వీటి సంఖ్యను మూడు రెట్లు పెంచి, ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న బ్లింకిట్ (Blinkit), జెప్టో (Zepto) మరియు స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ (Swiggy Instamart) వంటి సంస్థలకు గట్టి పోటీ ఇవ్వాలని అమెజాన్ భావిస్తోంది.
