Rohit vs Trigun Bigg Boss Promo 2 : కొట్టుకోవ‌డం ఒక్క‌టే త‌క్కువ‌..! రోహిత్ వ‌ర్సెస్ త్రిగుణ్‌.. ఆ జంపింగ్‌లు ఏంది సామీ.. టెంప‌ర్ వంశీతో వాగ్వాదం..

Rohit vs Trigun Bigg Boss Promo 2 : బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 10లో తొలి కెప్టెన్ కోసం నిన్న‌టి నుంచి టాస్క్‌ల‌ను నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే.

Bigg Boss Telugu 10 Day 10 Today Promo 2 Rohit vs Trigun and temper vamsi

Rohit vs Trigun Bigg Boss Promo 2 : బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 10లో తొలి కెప్టెన్ కోసం నిన్న‌టి నుంచి టాస్క్‌ల‌ను నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. నిన్న పెట్టిన ఓ టాస్క్ లో ఝాన్సీ, ముకేశ్, అమన్, షాలిని లు నెక్స్ట్ లెవల్ కి వెళ్లారు. ఇక నేటి ఎపిసోడ్‌కు సంబంధించి రెండో ప్రొమోను విడుద‌ల చేశారు. ఇందులో నిన్న ఓడిపోయిన రోహిత్, త్రిగుణ్‌, దేబ్జానీ, రామ్‌ప్ర‌సాద్‌ల‌కు బిగ్‌బాస్ మ‌రో టాస్క్ పెట్టిన‌ట్లుగా క‌నిపిస్తోంది. ఈ టాస్క్‌కు టెంప‌ర్ వంశీ సంచాల‌క్‌గా ఉన్నాడు.

బ‌స్తాలు కోసం కంటెస్టెంట్లు గ‌ట్టిగానే ట్రై చేశారు. అయితే.. ఇది కాస్త ఫిజిక‌ల్ అయిన‌ట్లుగా క‌నిపిస్తోంది. రోహిత్ అతి చేసిన‌ట్లుగా క‌నిపిస్తోంది. త్రిగుణ్ మీద‌కు ఎగిరి జంప్ చేశాడు. ఆ త‌రువాత ప్రొమో చివ‌రిలో బ‌స్తా అత‌డి చేతిలోనే ఉంద‌ని, మీ చేతుల్లోకి రాలేదు అని వంశీ అన‌గా.. రోహిత్ ఇందుకు అంగీక‌రించిన‌ట్లుగా క‌నిపించ‌డం లేదు. ఈ క్ర‌మంలో రోహిత్‌, టెంపర్ వంశీల మ‌ధ్య మాట‌ల యుద్ధం న‌డిచిన‌ట్లుగా క‌నిపిస్తోంది. మొత్తంగా అస‌లు ఏం జ‌రిగిందో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వ‌ర‌కు వెయిట్ చేయ‌క త‌ప్ప‌దు.

Nandita Swetha : న‌టి నందితా శ్వేత లాస్ట్ మినిట్ లుక్.. ఫోటోలు వైర‌ల్‌..