Today Horoscope in Telugu: రాశి ఫలాలు 27 ఏప్రిల్.. మోహిని ఏకాదశి.. నేడు ఈ రాశి వారు నక్క తోక తొక్కారు.. ఏం చేసినా లాభమే..!

Daily horoscope in Telugu Date 27 Apri : నేడు సోమవారం చాలా ప్రత్యేకమైన రోజు. అత్యంత శక్తివంతమైన మోహని ఏకాదశి. ఈ రోజున 12 రాశుల వారికి ఎలా ఉండబోతుంది అంటే..

Horoscope Today 27 April 2026 monday Rasi Phalalu Telugu

Today Horoscope in Telugu 27 April : ఏప్రిల్ 27, సోమవారం అత్యంత శక్తివంతమైన మోహినీ ఏకాదశి తిథి వస్తోంది. చాలా మంది ఈ రోజు ఉపవాసం పాటిస్తారు. అలానే ఈ రోజు అన్నవరం సత్యనారాయణ స్వామి వారి కళ్యాణోత్సవం కూడా. మరి ఇంత శుభసూచకమైన ఈ సోమవారం నాడు 12 రాశుల వారికి ఎలా ఉండబోతోంది.. వర్జ్యం, దుర్ముహూర్తం వంటి కాలాలు ఎప్పుడు ఉన్నాయి అనే వివరాలు మీకోసం..

ముఖ్య సమయాలు:

  • వర్జ్యం: తెల్లవారుజామున 4:54 నుండి 6:02 వరకు
  • దుర్ముహూర్తం: మధ్యాహ్నం 12:26 – 1:17 మరియు 2:58 – 3:49
  • రాహుకాలం: ఉదయం 7:15 నుండి 8:50 వరకు

ద్వాదశ రాశి ఫలాలు

1. మేష రాశి:

మేష రాశి వారికి సోమవారం పని వాయిదా వేసే మనస్తత్వం ఉంటుంది. ఆదాయం బాగున్నా ఖర్చులు అధికంగా ఉంటాయి. మానసిక ప్రశాంతత లోపిస్తుంది.

పరిహారం: దత్తాత్రేయ వజ్ర కవచం పారాయణ చేయడం మంచిది.

2. వృషభ రాశి:

సోమవారం వృషభ రాశి వారికి బంధుమిత్రులతో అభిప్రాయ భేదాలు తలెత్తే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో.. ముఖ్యంగా కళ్ళు, తలకు సంబంధించిన అంశాల్లో జాగ్రత్త అవసరం.

పరిహారం: నవగ్రహ కవచం పారాయణ చేయడం మరియు శివాలయ దర్శనం శుభకరం.

3. మిథున రాశి:

ఏప్రిల్ 27, సోమవారం మిథున రాశి అన్ని రంగాల వారికి అనుకూల సమయం. వృత్తి, ఉద్యోగాల్లో లాభదాయకమైన స్థితి ఉంటుంది.

పరిహారం: లలితా అష్టకమణి స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి.

4. కర్కాటక రాశి:

సోమవారం కర్కాటక రాశి వారికి ఆర్థిక పరమైన ఆటంకాలు, అనవసర ఖర్చులు ఉంటాయి. పత్రాలపై సంతకాలు చేసేటప్పుడు జాగ్రత్త అవసరం.

పరిహారం: చంద్ర కవచం పారాయణ మరియు శివాలయ దర్శనం ఉత్తమం.

5. సింహ రాశి:

సింహ రాశి వారికి సోమవారం ధనాదాయం వృద్ధి చెందుతుంది. ప్రతి పనిలోనూ చురుగ్గా పాల్గొంటారు. అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు.

పరిహారం: మానసాదేవి ద్వాదశ నామ స్తోత్రం పారాయణ చేయడం మంచిది.

6. కన్యా రాశి:

మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కోపం అధికంగా ఉండే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది.

పరిహారం: అయ్యప్ప పంచరత్న స్తోత్ర పారాయణ మరియు అయ్యప్ప స్వామి దర్శనం మేలు చేస్తుంది.

7. తులా రాశి:

సోమవారం తులా రాశి వారికి శుభకార్య ప్రయత్నాలు నెరవేరుతాయి. స్థిరాస్తి వృద్ధి చెందుతుంది. ప్రభుత్వ పరమైన పనులు సఫలమవుతాయి.

పరిహారం: పంచముఖ హనుమత్ కవచం పారాయణ చేయడం శుభప్రదం.

8. వృశ్చిక రాశి:

ఏప్రిల్ 27, సోమవారం వృశ్చిక రాశి వారికి వాతావరణం ఆనందదాయకంగా ఉంటుంది. ఉద్యోగులకు ప్రమోషన్లు, ఆదాయ వృద్ధి కలిగే అవకాశం ఉంది.

పరిహారం: దేవీ ఖడ్గమాల స్తోత్రం పారాయణ చేయడం విశేష ఫలితాలనిస్తుంది.

9. ధనుస్సు రాశి:

ధనుస్సు రాశి వారికి సోమవారం కుటుంబంలో కలహాలు, స్థానచలన మార్పులు ఉండవచ్చు. ఎంత పని చేసినా గుర్తింపు లభించకపోవచ్చు.

పరిహారం: నరసింహ కవచం పారాయణ చేయడం మరియు విష్ణు దర్శనం శ్రేయస్కరం.

10. మకర రాశి:

సోమవారం మకర రాశి వారికి అపనిందలు, అవమానకర పరిస్థితులు ఎదురుకావచ్చు. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

పరిహారం: దశావతార స్తుతి చేయడం మరియు వేంకటేశ్వర స్వామి దర్శనం మంచిది.

11. కుంభ రాశి:

ఏప్రిల్ 27, సోమవారం కుంభ రాశి వారికి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు కలిసి వస్తాయి.

పరిహారం: చంద్ర కవచం పారాయణ చేయడం మేలు.

12. మీన రాశి:

సోమవారం మీన రాశి వారికి ఆరోగ్యపరంగా సుఖ సంతోషాలు ఉంటాయి. కోర్టు వ్యవహారాల్లో అనుకూలత లభిస్తుంది. ధన యోగం కలుగుతుంది.

పరిహారం: కనకధారా స్తోత్ర పారాయణ మరియు గోపూజ చేయడం అత్యంత శుభకరం.