Motorola G37 Price : మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. ఈ మోటోరోలా G37పై రూ. 8వేలు డిస్కౌంట్.. ఇలాంటి ఆఫర్ మళ్లీ రాదు..!
Motorola G37 Price : రూ. 25వేల విలువైన మోటోరోలా ఫోన్ రూ. 8వేలకు పైగా తగ్గింపుతో లభిస్తోంది. 50MP కెమెరా, 5200mAh బ్యాటరీతో లభిస్తోంది. ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలంటే?
Motorola G37 Price
- ఈ ఫోన్‌పై అసలు ధరపై రూ. 8వేలకుపైగా తగ్గింపు
- ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ 32శాతం తగ్గింపుతో కొనేసుకోవచ్చు
- మోటోరోలా ఫోన్లో అద్భుతమైన స్పెసిఫికేషన్లు
Motorola G37 Price : మోటోరోలా జీ37 కొనేందుకు ఇదే బెస్ట్ టైమ్.. మోటోరోలా ఫోన్ 5200mAh బ్యాటరీ, 50MP మెయిన్ కెమెరాతో వస్తుంది. కంపెనీ ఈ ఫోన్‌ను రూ. 25వేలు ప్రారంభ ధరతో లాంచ్ చేసింది.
కానీ, ఇప్పుడు ఈ మోటోరోలా ఫోన్ రూ. 17వేలు కన్నా తక్కువ ధరకే అందుబాటులో ఉంది. ఈ ఫోన్ అసలు ధరపై రూ. 8వేలకుపైగా తగ్గింపుతో లభిస్తోంది. మోటోరోలా G37 బెస్ట్ డీల్ ఆఫర్లు ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఫ్లిప్‌కార్ట్‌లో మోటోరోలా జీ37 ధర తగ్గింపు :
ప్రస్తుతం మోటోరోలా G37 ఫోన్ అత్యంత తక్కువ ధరకే లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ ఈ ఫోన్‌ను 32శాతం తగ్గింపుతో అసలు ధర నుంచి రూ.8వేలు (Motorola G37 Price) తగ్గింపుతో అందిస్తోంది. ఈ-కామర్స్ వెబ్సైట్ రూ. 16,999 ధరకు లిస్ట్ చేసింది.
ఈ ఫోన్‌పై బ్యాంక్ ఆఫర్లు కూడా పొందవచ్చు. డెబిట్ లేదా క్రెడిట్ కార్డుతో మోటోరోలా జీ37 ఫోన్‌పై అదనంగా రూ. 850 ఆదా చేయొచ్చు. అప్పుడు ఈ ఫోన్ ధర రూ. 16,999 అవుతుంది.
మోటోరోలా G37 స్పెసిఫికేషన్లు :
మోటో G37లో 120Hz రిఫ్రెష్ రేట్, 1050 నిట్స్ బ్రైట్‌నెస్‌తో 6.7-అంగుళాల HD+ LCD డిస్ప్లే ఉంది. ARM మాలి-G57 MC2 జీపీయూతో ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6400 6nm ప్రాసెసర్‌తో రన్ అవుతుంది.
సేఫ్టీ కోసం ఇందులో సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది. 20W టర్బోఛార్జింగ్, 6W రివర్స్ ఛార్జింగ్‌తో 5200mAh బ్యాటరీ సపోర్టు ఇస్తుంది. బ్యాక్ సైడ్ ఎఫ్/1.8 అపర్చర్, 2-ఇన్-1 లైట్ సెన్సార్‌తో 50MP ప్రైమరీ కెమెరా ఉంది.
సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 8MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. దుమ్ము, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP64 రేటింగ్, MIL-STD 810H సర్టిఫికేషన్‌తో కూడా వస్తుంది.
