GMC Nalgonda Jobs: జాబ్ అంటే ఇది.. నెలకు రూ.రూ.1,90,000 జీతం.. పరీక్ష లేదు.. ఇంటర్వ్యూలో సెలక్ట్ అయితే చాలు..!

GMC Nalgonda Jobs : నల్లగొండ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆవివరాలు..

Notification for GMC Nalgonda 62 faculty Vacancies in Nlg Government Medical College

GMC Nalgonda Jobs : మంచి ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూసే వారికి తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. నెలకు గరిష్టంగా రూ. 1,90,000 వరకు జీతం వచ్చే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. నల్గొండ ప్రభుత్వ మెడికల్ కాలేజీలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న వివిధ బోధనా సిబ్బంది పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఈ కాలేజీ తెలంగాణ ప్రభుత్వ వైద్య విద్యా సంచాలకుల (DME) పరిధిలో ఉండగా, ప్రస్తుతానికి కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ పోస్టులను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతున్నారు.

ఖాళీల వివరాలు (మొత్తం ఖాళీలు: 62)

  1. ప్రొఫెసర్: 01
  2. అసోసియేట్ ప్రొఫెసర్: 15
  3. అసిస్టెంట్ ప్రొఫెసర్: 32 (వివిధ విభాగాలతో కలిపి)
  4. ట్యూటర్: 14

విభాగాలు:
జనరల్ మెడిసిన్, అనాటమీ, ఫార్మకాలజీ, ఫిజియాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, బయోకెమిస్ట్రీ, రేడియాలజీ, పీడియాట్రిక్స్, ఓబీజీ (OBG), డీవీఎల్ (DVL), జనరల్ సర్జరీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, కమ్యూనిటీ మెడిసిన్ తదితర విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.

అర్హతలు:
సంబంధిత విభాగంలో MD / MS / DNB లేదా NMC (నేషనల్ మెడికల్ కమిషన్) నిబంధనల ప్రకారం అర్హత కలిగి ఉండాలి.

మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్: తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్ తప్పనిసరి. ఇతర రాష్ట్రాల అభ్యర్థులు ఎంపికైన వారం రోజుల్లోగా ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది.

వయస్సు: దరఖాస్తుదారులు 69 ఏళ్ల లోపు వారై ఉండాలి.

జీతభత్యాల వివరాలు (నెలకు):

  • ప్రొఫెసర్: రూ. 1,90,000
  • అసోసియేట్ ప్రొఫెసర్: రూ. 1,50,000
  • అసిస్టెంట్ ప్రొఫెసర్: రూ. 1,25,000
  • ట్యూటర్: రూ. 55,000

ఇంటర్వ్యూ వివరాలు:

  • తేదీ: మార్చి 16, 2026
  • సమయం: ఉదయం 10:00 గంటల నుంచి మధ్యాహ్నం 2:00 గంటల వరకు.
  • వేదిక: ప్రిన్సిపాల్ ఛాంబర్, ప్రభుత్వ వైద్య కళాశాల (GMC), నల్గొండ.

ముఖ్య గమనిక:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరయ్యే సమయంలోనే ఆయా పోస్టులకు సంబంధించిన తమ ఒరిజినల్ సర్టిఫికేట్లను వెరిఫికేషన్ కోసం వెంట తీసుకురావాల్సి ఉంటుంది. ఉద్యోగాలకు ఎంపికైన వారు వారం రోజుల్లోగా విధుల్లో చేరాల్సి ఉంటుంది.