GHMC Defaulters List: రూ.కోట్లలో పన్ను ఎగవేత.. డిఫాల్టర్ల వివరాలు వెల్లడించిన GHMC
హైదరాబాద్ నగరంలోని మూడు కార్పొరేషన్ల పరిధిలో ఉన్న పన్ను ఎగవేతదారుల జాబితాను తాజాగా అధికారులు వెల్లడించారు. వీరంతా కోట్ల రూపాయల మేర పన్ను బకాయిలు చెల్లించాల్సి ఉంది.
- Dharani Pilli
- Published On : March 5, 2026 / 07:44 PM IST
officials have released the top defaulters list in the GHMC limits in 2026 and issue red notices
హైదరాబాద్ నగరంలోని మూడు కార్పొరేషన్ల (GHMC, TGIC, HMDA పరిధిలోని మున్సిపాలిటీలు) పరిధిలో ఆస్తి పన్ను వసూళ్లపై అధికారులు ఫోకస్ పెంచారు. మార్చి 31 వరకు రూ. 3,000 కోట్ల ఆస్తి పన్ను వసూళ్లను లక్ష్యంగా పెట్టుకున్న అధికారులు… ఇప్పటివరకు రూ. 2,025 కోట్ల వరకు వసూలు చేశారు. దీంతో పాటు మూడు కార్పొరేషన్ల వారీగా టాప్ డిఫాల్టర్లకు రెడ్ నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో మూడు కార్పొరేషన్ల పరిధిలో దాదాపు రెండు లక్షల వరకు రెడ్ నోటీసులు జారీ చేశారు అధికారులు.
ఇదిలా ఉండగా జీహెచ్ఎంసీ (GHMC) పరిధిలో టాప్ డిఫాల్టర్ల జాబితాను అధికారులు ప్రకటించారు. ఈ జాబితాలో ప్రముఖ కంపెనీలు ఉన్నాయి. ఇవన్నీ కోట్ల రూపాయల మేర పన్ను ఎగవేతకు పాల్పడ్డాయి. అధికారులు వెల్లడించిన ఆ కంపెనీల వివరాలు ఇలా ఉన్నాయి:
- హైదరాబాద్ అస్బెస్టాస్ సిమెంట్ రూ. 13 కోట్లు
- సందేశ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ. 4.45 కోట్లు
- కృపాదేవి అండ్ అందర్స్ రూ. 6.4 కోట్లు
- శ్రీ లక్ష్మి గాయత్రి హోటల్స్ రూ. 6.13 కోట్లు
- హైదరాబాద్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రూ. 3.5 కోట్లు
- ఐటీఎల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రూ. 3.5 కోట్లు
- లీలా హోటల్స్ రూ. 1.5 కోట్లు
- ఎంఎస్ సుందర్ స్టీల్స్ రూ. 2.95 కోట్లు
- అశి రిలేషన్స్ రూ. 2.37 కోట్లు
- ప్రీ స్టీల్ ఫ్యాబ్రిక్స్ రూ. 2.23 కోట్లు
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గతేడాది ఆస్తిపన్ను ఎగవేతదారుల కోసం ‘వన్-టైమ్ స్కీమ్’ను ప్రకటించింది. దీనిలో భాగంగా ఆస్తిపన్ను బకాయి వడ్డీపై 90 శాతం మినహాయింపును ప్రకటించింది. ఈ పథకం కింద, డిఫాల్టర్లు ఆస్తి పన్ను బకాయిల అసలు మొత్తంతో పాటు పేరుకుపోయిన బకాయిలపై 10 శాతం బకాయి వడ్డీని ఒకే చెల్లింపులో క్లియర్ చేయవచ్చు.
