Viral Video: సరస్సులో పడ్డ కారు.. నీళ్లలో దూకి తండ్రీకూతుళ్లను యువకుడు ఎలా కాపాడాడంటే?

ఓ జలపాతానికి సమీపంలోని సరస్సు చివరన ఓ ఎరుపు రంగు కారు ఉండడాన్ని ఈ వీడియోలో చూడొచ్చు.

Viral Video

Viral Video – Indore: ఓ కారు ప్రమాదవశాత్తూ సరస్సులో పడిపోయింది. దీంతో ఓ యువకుడు నీళ్లలోకి దూకి ఆ కారులోని తండ్రీకూతుళ్లను కాపాడారు. అనంతరం వారికి మరికొంత మంది యువకులు సాయం చేశారు. దీంతో కారులోని తండ్రీకూతుళ్లు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లోని ఇండోర్ లో చోటుచేసుకుంది.

ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఓ జలపాతానికి సమీపంలోని సరస్సు చివరన ఓ ఎరుపు రంగు కారు ఉండడాన్ని ఈ వీడియోలో చూడొచ్చు. ఒక్కసారిగా ఆ కారు నీళ్లలో పడిపోయింది. అక్కడ స్మార్ట్ ఫోన్లో కొందరు వీడియోలు తీసుకుంటున్నారు.

కారు నీళ్లలో పడ్డాక ఓ యువకుడు తన దుస్తులు కూడా విప్పకుండా నీళ్లలోకి దూకాడు. అతడు దూకిన తర్వాత మరికొందరు కూడా నీళ్లలో ఈదుతూ కారు వద్దకు వెళ్లారు. కారులోని తండ్రీకూతుళ్లని సురక్షితంగా బయటకు తీశారు. తండ్రీకూతుళ్లను కాపాడడానికి నీళ్లలోకి దూకిన సునీల్ మాథ్యూ (26)పై ప్రశంసల జల్లు కురుస్తోంది. కారులోని తండ్రి వయసు దాదాపు 43, కూతురి వయసు 13 ఉంటుందని సునీల్ చెప్పాడు.

TSRTC: త్వరలో తెలంగాణ రోడ్లపై హైటెక్ ఎలక్ట్రిక్ బస్సులు.. వాటి ప్రత్యేకతలేంటో తెలుసా?

ట్రెండింగ్ వార్తలు