Viral Video: చిట్టిచేతులతో తల్లిని ఓదార్చిన రెండేళ్ల బాలుడు

Viral Video: తల్లిని చిట్టిచేతులతో ఆ చిన్నారి ఓదార్చిన తీరు అద్భుతమని నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

Viral Video: స్కూల్‌కి వెళ్లనని చిన్నారులు ఏడిస్తే వారిని తల్లులు ఓదారుస్తుంటారు. స్కూలుకి ఎందుకు వెళ్లాలో చెప్పి, వారిని మోటివేట్ చేస్తారు. అయితే, ఆఫీసుకి వెళ్లనని తల్లి ఏడిస్తే? ఆమెను ఎవరు ఓదారుస్తారు? ఆమెను ఆఫీసుకి పంపేలా ఎవరు మోటివేట్ చేస్తారు?

ఓ చిన్నారి ఈ బాధ్యతను తాను తీసుకుని అందరితో శభాష్ అనిపించుకుంటున్నాడు. తల్లిని రెండేళ్ల చిన్నారి ఓదార్చేటప్పుడు తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. చాలా క్యూట్ గా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రతి తల్లికి ఇటువంటి కొడుకు ఉండాలని అంటున్నారు. యువన్స్ భరద్వాజ్ అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఆ తల్లీకొడుకుల వీడియోను పోస్ట్ చేశారు.

“నేను ఆఫీసుకి వెళ్లను” అంటూ ఓ తల్లి తన రెండేళ్ల బాలుడికి చెబుతూ ఏడుస్తున్నట్లు నటిస్తుంది. ఆ సమయంలో తన కుమారుడి భుజంపై తల పెడుతుంది. ఆఫీసుకి వెళ్లాలి కదా.. అంటూ ఆ బాలుడు తల్లికి నచ్చజెబుతాడు. ఆమె తలపై నిమురుతూ ఓదారుస్తాడు. ఈ వీడియోను పోస్ట్ చేసిన కొద్ది సేపటికే లక్షలాది మంది చూశారు. తల్లిని చిట్టిచేతులతో ఆ చిన్నారి ఓదార్చిన తీరు అద్భుతమని నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

ONDC App : కొత్త ONDC యాప్ వచ్చేసింది.. ఇక జొమాటో, స్విగ్గీతో పనిలేదు.. తక్కువ ధరకే ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు.. ఇదిగో ప్రాసెస్..!

ట్రెండింగ్ వార్తలు