విజయవాడ బుడమేరు వంతెన దగ్గర ఒక్కరోజే 100 కేసులు నమోదు చేశారు. రూ.15 వేలు జరిమానా విధించారు.
విజయవాడలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులపై పోలీసులు కొరడా ఝుళిపించారు. విజయవాడ బుడమేరు వంతెన దగ్గర ఒక్కరోజే 100 కేసులు నమోదు చేశారు. రూ.15 వేలు జరిమానా విధించారు.
హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపే వారిపై చర్యలు తీసుకుంటున్నట్టు ఏడిసిపి నాగరాజు, సిఐ బాలరాజు తెలిపారు. ఇకపై విజయవాడ నగరంలో హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు.